పండ్ల కోసం అక్కడ హత్యలు కూడా చేస్తున్నారు.. ఏమిటవి..!

MOHAN BABU
కెన్యా రైతులకు అవకాడో పండ్ల సాగు మంచి లాభాలను తెచ్చి పెడుతోంది. దీంతో ఈ తోటలు సాగు చేసేవారిని నేర ముఠాలు లక్ష్యంగా చేసుకుంటున్నాయి.  ఇక్కడ ఒక్కో చెట్టునుంచి 44,550 రూపాయల వరకు లాభం వస్తుంది. అమెరికా, ఐరోపా లో ఈ పండ్లకు డిమాండ్ పెరుగుతోంది. అదే సమయంలో ఆఫ్రికా నుంచి వీటిని అత్యధికంగా ఎగుమతి చేసే దేశంగా దక్షిణాఫ్రికా స్థానాన్ని గత ఏడాది కెన్యా భర్తీ చేసింది. గ్రీన్ గోల్డ్ గా పిలుస్తున్న ఈ పంటను రక్షించడానికి కొన్నిచోట్ల అవకాడో రక్షణ బృందాలు కూడా ఏర్పాటు చేస్తున్నారు.మురంగా కౌండిలోని ఓ పొలంలో రాత్రి అవ్వగానే ఆరుగురు వ్యక్తులు రెయిన్ కోట్ లు వేసుకొని, చేతిలో టార్చ్ లైట్లు, కత్తులు పట్టుకొని తిరుగుతుంటారు.

 విలువైన అవకాడో లను దొంగలు ఎత్తుకుపోకుండా కాపు కాయడమే వారి పని. దొంగలకూ,రైతులకు మధ్య ఘర్షణలు జరుగుతూ ఉంటాయి. ఇటీవల ఘర్షణలో ఒక అవకాడో దొంగ మరణించాడని ఒక తోట యజమాని వివరించాడు. ఇలా కాపు కాయకపోతే అవకాడోలు దొంగలపాలవుతాయని ఆయన చెప్పారు. పొలం చుట్టూ ముళ్లకంచెలు వేసిన దొంగల్ని ఆపలేకపోతున్నామని అందుకే తాము రాత్రి కాపలా కాయాల్సి వస్తుందని ఆయన తెలిపారు. ఎంతో కష్టపడి పండించిన పంటను, తాము ఏ మాత్రం అజాగ్రత్తగా ఉన్నా దొంగలు గంటల వ్యవధిలో మాయం చేస్తారని ఓ వ్యక్తి అన్నారు. ఈ ప్రాంతంలో చాలామందికి అవకాడో వ్యాపారమే ఆధారం. నిద్ర వస్తుందని తాము కాసేపు కునుకు తీసిన మొత్తం లూటి చేస్తారని ఒక రైతు ఆవేదన వ్యక్తం చేశారు. రాత్రంతా తోట కాపలా కాసినవారు తిరిగి ఉదయం ఇళ్లకు వెళ్తారు. అవకాడొలు కెన్యా లో ఫిబ్రవరి నుంచి అక్టోబర్ మధ్య లో కోతకు వస్తాయి.ఇదే సమయంలో దొంగతనాలు కూడా పెరుగుతుంటాయి.

బ్లాక్ మార్కెట్ ను అడ్డుకునేందుకు నవంబర్ నుంచి జనవరి చివరి వరకు అవకాడో లను ఎగుమతి చేయకుండా అక్కడి అధికారులు ఆంక్షలు విధించారు. అయితే క్షేత్రస్థాయిలో ఈ ఆంక్షల ప్రభావం చాలా తక్కువ. కాస్త ధనవంతులైన రైతులు టెక్నాలజీ సాయంతో తోటలను కాపాడుకోవాలని చూస్తున్నారు. తోట చుట్టూ సీసీ కెమెరాలను అమర్చుతున్నారు. కెన్యాలో అవకాడో వాణిజ్యం ఇంకా ఆరంభదశలోనే ఉంది. ఇప్పుడిప్పుడే చాలామంది ఈ పంట వైపు మొగ్గు చూపుతున్నారు. గత ఏడాది కెన్యా రైతులు 980 కోట్ల రూపాయల  విలువైన పండ్లను విదేశాలకు ఎగుమతి చేశారు. ఇక్కడ పండించిన మొత్తం పండ్లలో ఇది 10 శాతం వరకు ఉంది. నాణ్యత బాగా ఉంటే పెరూ, బ్రెజిల్ లాంటి దేశాలతో పోటీ పడవచ్చని వచ్చే ఐదేళ్లలో చాలామంది తేయాకు అవకాడో పంటకు వచ్చేస్తారని అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: