ఆహార సంక్షోభం ఎదుర్కొంటున్న శ్రీ లంక .. పాలప్యాకెట్ కూడా కొనలేని పరిస్థితి !!!

Surya
కొండ నాలుకకు మందు వేస్తె ఉన్న నాలుక ఊడింది అన్న చందం గా మారింది శ్రీ లంక ప్రభుత్వ పని తీరు. శ్రీలంక ప్రభభుత్వ విధి విధానాలు ఆ దేశ ప్రజల కొంప ముంచుతున్నాయి. పేద ప్రజలు కడుపునిండా ఐదు వేళ్ళు నోట్లోకి వెళ్లలేని పరిస్థితి. నిన్న మొన్నటి దాక కిలో పాలప్యాకెట్ ధర వందల్లో ఉండగా తాజాగా దాని ధర 1,195 రూ. పెరిగింది. దింతో పేద ప్రజలు నిత్యావసరమైన పాల ప్యాకెట్ ను కొనలేని పరిస్థితి. రోజురోజుకు ఆ దేశం లో నిత్యావసర సరుకుల ధరలు పెరిగిపోతూనే ఉన్నాయ్. ఈ నేపధ్యలో నే వంట గ్యాస్ ధర కూడా ఆకాశానంటింది . నిన్న మొన్నటిదాక 12.5 కే.జిల గ్యాస్ బండ ధర 1400 రూ. ఉండగా గడచినా రెండు రోజుల్లోనే దాని ధర 2,657 రూ. కి చేరింది . ఇవే కాకుండా పప్పు , ఉప్పు , చింతపండు , కారం. గోధుమ పిండి, పంచదార ఇంకా సిమెంట్ ఇలా అన్ని రంగాలలో నిత్యావసర ధరలు ఆకాశాన్నంటాయి . దీని అంతటికి కారణం ఆదేశం లో ధరల పై నియంత్రణ ఎత్తివేయడమే. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం కారణంగా విక్రేతలు వస్తు ధరలను అమాంతం పెంచేశారు. ఇది ఇలాగె కొనసాగితే పేద ప్రజలకు ఆకలి చావులు తప్పవని పొరుగు దేశాలు శ్రీలంకను హెచ్చరిస్తున్నాయి.

 

కరోనా మహమ్మారి సమయం నుండి ఇప్పటి దాకా ఆహార , ఆర్ధిక సంక్షోభం శ్రీలంక ను దెబ్బతిశాయి . ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలతో ఆ దేశం కుదేలవుతుంది. పాండమిక్ సమయంలో ఎగుమతులు దెబ్బతిన్నాయి . పర్యాటక రంగం దెబ్బతింది ఆ కారణంగా విదేశీయుల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది . దింతో ఆదాయం భారీగా తగ్గిపోయింది. విదేశాల మారక విలువలను నిల్వ చేసుకునే క్రమంలో దిగుమతులపై నిషేధం చేయక తప్పలేదు. ఇలాంటి సమయం లో ధరలపై నియంత్రణ ఎత్తి వేయడంతో నిత్యావసరాల ధరలు ఆకాశాన్నంటాయి.


దరల పై నియంత్రణ కొనసాగుతున్న సమయంలో దళారులు అక్రమ వస్తు నిల్వలను అమాంతం పెంచేశారు. దేశం లో నిత్యావసరాల రవాణా తగ్గి పోయింది. దేశం లో తీవ్ర వస్తు సంక్షోభం ఏర్పడింది . ఈ నేపథ్యం లో ఆ దేశ అధ్యక్షుడు గొటబయ రాజపక్స అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేసారు. ఈ సమస్యను అధిగమించాడని ధరలపై నియంత్రణ ఎత్తివేయడం ఒక్కటే మార్గం ఆకున్నారో ఏమో కానీ . ధరలపై నియంత్రణ ఎత్తి వేశారు దాంతో దేశం లో ని అక్రమ నిల్వలు బయటకు వస్తాయని భావించారు తద్వారా వస్తు సరఫరా పెంచవచ్చు అనుకున్నారు కానీ సీన్ కాస్త రివర్స్ అయ్యింది వస్తు సరఫరా జరగక పోగా వస్తు ధరలు అమాంతం పెరిగి కొండెక్కి కూర్చున్నాయి . దింతో అందరు కొండ నాలుకకు మందు వేస్తె ఉన్న నాలుక ఊడిందన్న చందం గా ఈ ప్రభుత్వ తీరు ఉందని విమర్శలు వినిపిస్తున్నాయి

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: