ఇకపై పానీపూరి అంటే అస్సలు తినరు ..?

Divya
సాధారణంగా పానీపూరి, గోల్ గప్ప ,చాట్ ఇలా రకరకాలుగా పిలుచుకునే పానీ పూరి ని తినడానికి చాలామంది ఇష్టంగా ఉంటారు. ఇక ముఖ్యంగా చెప్పాలంటే ఆడపిల్లలకు పానీపూరి అంటే ఎనలేని ఇష్టం. ఇక వీరి ఇష్టం కారణంగానే పానీపూరి బండి వాడు కూడా లక్షల్లో డబ్బు సంపాదిస్తున్నాడు. ముఖ్యంగా అమ్మాయిలు మాత్రమే కాదు ఇటీవల పిల్లలు, అబ్బాయిలు కూడా ఈ పానిపూరి తిండానికి ఇష్టపడుతున్నారు. ఎందుకంటే రోడ్ సైడ్ దొరికే పానీ పూరి తింటే ఎంత మజా వస్తుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.

ఇక  వీరే కాదు  చాలా మంది సాయంత్రం వేళ ఏదో ఒకటి తినడానికి అలా బయటికి వెళ్ళినప్పుడు  ఎక్కువగా పానీపూరి, గోబీ సెంటర్,  కబాబ్ సెంటర్ లు కనిపిస్తూ ఉంటాయి. వాటిలో ఏదో ఒకటి మనం స్నాక్స్ రూపంలో తింటూ ఉంటాం. అయితే ఇప్పుడు ఒక చూపపోయే ఇక  వీడియో చూస్తే , మీరు జీవితంలో ఇలాంటి వాటికి దూరంగా ఉంటారు. అంతేకాదు ఇంకోసారి స్ట్రీట్ ఫుడ్ తినాలంటేనే భయపడతారు. ఇక ఆ వీడియో గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

పూర్తి వివరాల్లోకి వెళితే అస్సాం రాష్ట్రంలోని గౌహతి  ప్రాంతానికి చెందిన ఒక పానీపూరి బండి ని రోడ్డు మీద పెట్టుకున్న ఒక వ్యక్తి చేసిన పని చూస్తే ఒక్కసారిగా ఆశ్చర్య పోవటమే కాకుండా యాక్ అంటారు. అతను అందులోకి తన"మలమూత్రంని"ఒక డబ్బాలో కి పట్టుకొని అందులోకి ముంచడం, ఆ వీడియోలో క్లియర్ గా కనిపిస్తోంది. అయితే ఈ వీడియో వైరల్ కావడం చేత అక్కడికి హఠాత్తుగా పోలీసులు వచ్చి, ఆ వ్యక్తిని అరెస్టు చేయడం జరిగింది.
ఇక  ఈ వీడియో ఎక్కడ చూసినా ప్రస్తుతం చాలా వైరల్ గా మారింది. ఈ వీడియో కింద నెటిజన్లు కూడా కామెంట్లు రూపంలో ఆ వ్యక్తిని తెగ తిడుతున్నారు. ఇలాంటివన్నీ చేయడంవల్ల, సమాజంలో చాలా మంది స్ట్రీట్ ఫుడ్ అంటేనే భయపడుతున్నారు. అందుకే ఫుడ్ అధికారులు స్ట్రీట్ ఫుడ్ తినవద్దు అని ఎన్నిసార్లు చెప్పినా ప్రజలు వినడంలేదు. ఈ వీడియో చూసిన తర్వాత అయిన, ఓపిక తెచ్చుకొని ఇంట్లో తయారు చేసుకొని తినడానికి ప్రయత్నం చేయండి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: