ప్రేయసి కోసం ఆ పని చేసి బుక్కయిన ప్రియుడు..

Purushottham Vinay
ఇక సెనెగల్ దేశానికి చెందిన ఖాదీమ్ ఎంబూప్ అనే వ్యక్తి.. గాస్టన్ బెర్గర్ అనే ఓ యూనివర్సిటీలో చదువుతున్నాడు. ఇక అతనికి గంగూ డియోమ్ అనే ప్రియురాలు కూడా ఉంది. తాజాగా తన ప్రేయసికి హైస్కూల్ గ్రాడ్యూయేషన్ పరీక్షలు అనేవి జరుగుతున్నాయి. అయితే ఆ యువతి మాత్రం పరీక్షలు రాసి పాస్ అయ్యే పరిస్థితి అసలు లేదు. దాంతో అతనే ఆ పరీక్షలు రాయాలని నిర్ణయించుకోవడం జరిగింది.ఇక అనుకున్నదే తడవు ఎంబూప్ చివరికి తన ప్రేయసి కోసం ఆడ వేశం వేశాడు. డ్రెస్, మేకప్ తో పాటుగా మొత్తం సెటప్‌నే అతను మార్చేశాడు.ఇక మొత్తానికి ఎవరికీ కూడా అనుమానం రాకుండా మొదటి రోజు ఎగ్జామ్ సెంటర్‌లోకి ప్రవేశించి గంగూ డియోమ్ తరఫున మొదటి పరీక్ష రాసేయడం జరిగింది. ఇలా మూడు రోజులు బాగానే ప్రశాంతంగా సాగింది. కానీ, నాలుగో రోజు మాత్రం అతని ప్రవర్తనపై ఇన్విజిలేటర్‌కు బాగా అనుమానం వచ్చింది.ఇక అతన్ని చెక్ చేయగా.. అప్పుడు దెబ్బకి అసలు గుట్టు రట్టు అయ్యింది. అతను అడ్డంగా బుక్కయ్యాడు. ఇక అతన్ని స్థానిక పోలీసు అధికారులకు అప్పగించడం జరిగింది.

 వారు అతన్ని విచారించగా అతను తన ప్రేయసి కోసమే ఈ పరీక్ష రాసినట్లు అంగీకరించడం జరిగింది. దాంతో ఈ ప్రేమ పక్షులిద్దరిపై కూడా చీటింగ్ ఇంకా ఫోర్జరీ కేసులు నమోదు చేయడం జరిగింది.ఇక దీనిపై విచారణ కూడా జరుపుతున్నారు. ఇక ఈ వ్యవహారంలో దోషులని తేలితే.. వారిద్దరూ కూడా ఐదేళ్ల పాటు డిబార్ అవుతారట. అలాగే వారికి సర్టిఫికెట్ కూడా రాదట.అంతేగాక ఈ జంటకు ఐదేళ్ల వరకు కూడా జైలు శిక్ష కూడా పడే ఛాన్స్ ఉందని అక్కడి అధికారులు తెలిపడం జరిగింది.ఇక ఈ వార్త ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా బాగా ట్రెండ్ సెట్ చేస్తోంది.తన ప్రేయసి కోసం ఆ యువకుడు చేసిన పనిని నెటిజన్లు ఇప్పుడు అభినందిస్తున్నారు. అతని ధైర్యానికి నెటిజన్లు ఫిదా అయిపోతున్నారు. తన ప్రియురాలిని పాస్ చేయించేందుకు అతను చేసిన సాహాసాన్ని వారు కొనియాడుతున్నారు.ప్రేమించిన ప్రియురాలి కోసం ప్రియుడు ఏదైనా చేస్తాడని ఈ ఘటనతో మరోమారు నిరూపితం అయ్యిందంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: