పెనం మీదే కాదు కుక్కర్లో కూడా చపాతీ కాల్చొచ్చు...

Purushottham Vinay
ఇక చపాతీలు ఎంత రుచిగా వుంటాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇక చపాతీలంటే ఇష్టపడని వారుండరు. వెజ్ కర్రీలో అయినా నాన్ వెజ్ కర్రీలో అయినా చపాతీ రుచి అద్దిరిపోతుంది. ఇక చపాతీ బాలానికి కూడా చాలా మంచిది. ఇది తింటే ఎంతో బలంగా పుష్టిగా వుంటారు కూడా. ఇక సాధారణంగా చపాతీలను దేనిపై కాలుస్తారో తెలుసా ? ఇదేం ప్రశ్న.. పెనం మీదే కాలుస్తారు. అది కూడా తెలీదా? అనేగా మీ సమాధానం.ఇక మీరు చెప్పింది నిజమే. అయితే, ఈ మహిళ మాత్రం చపాతీలను పెనం మీద కాల్చదు. సింపుల్‌గా ప్రెజర్ కుక్కర్‌లో పెట్టేసి క్షణాల్లో కాల్చేసి రుచికరమైన చపాతీలను తయారు చేసేస్తుంది. ఇది మీకు చిత్రంగానే ఉండవచ్చు. కానీ, సోషల్ మీడియాలో వైరల్‌గా చక్కర్లు కొడుతూ హల్ చల్ చేస్తున్న ఈ వీడియో చూస్తే తప్పకుండా మీకు పోకిరి సినిమాలో సూపర్ మహేష్ బాబు చెప్పినట్టు దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అవుతుంది.

ఇక ఈ వీడియోలో చూసినట్లయితే .. ఆ మహిళ పిండిని తీసుకుని చకచకా చపాతీలను చేసింది. ఇక పెనానికి బదులు ఒకేసారి మూడు చపాతీలను వేసి కుక్కర్లో వేడి చేసింది. కుక్కర్ విజిల్, గ్యాస్‌కట్ కూడా తీయలేదు. మూడు నిమిషాలు ఆ చపాతీలను కుక్కర్లోనే ఉంచింది. ఇక అంతే.. రుచికరమైన నోరూరించే చపాతీలు రెడీ అయిపోయాయి. ఈ వీడియో చూసి నెటిజనులు ఆశ్చర్యపోతున్నారు. ‘‘అయ్యో.. ఇలా చేయాలని తెలియక, పెనం మీద వేసి కాల్చేస్తున్నామే’’ అని తెగ బాధపడిపోతున్నారట. మరియు ఇది చాలా చక్కని పద్ధతి అని, చపాతీలు ఆవిరి మీద సమానంగా ఉడుకుతాయని మరికొందరు విశ్లేషించి మరీ చెబుతున్నారు.మరి ఇంకెందుకు ఆలస్యం ఆ వీడియో మీరు చూసి చపాతీలను చాలా ఈజీగా తయారు చేసుకోండి. హ్యాపీ గా తినేసేయండి.టైం సేవ్ చేసుకోండి.



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: