12 ఏళ్ల తరువాత తిరిగి ప్రారంభం కానున్న తుంగభద్ర పుష్కరాలు..ఈ నెల 20 నుండి ప్రారంభం ..

KISHORE
12 సంవత్సరాల తరువాత తుంగభద్ర పుష్కరాలు మళ్ళీ ప్రారంభం కన్నున్నాయి..పుష్కరాలకు సంబందించి ప్రారంభ ముహూర్తం ఖరారైంది.ఈ నెల 20వ తేదీ మధ్యాహ్నం 1.21 గంటలకు పుష్కరాలు  ప్రారంభం కానున్నట్టుగా దేవదాయ శాఖ నిర్ణయించింది. 
దేవదాయ శాఖ అర్చక ట్రైనింగ్‌ అకాడమీ ఆధ్వర్యంలో ఇటీవల విశాఖపట్నంలో దైవజ్ఞ సమ్మేళనంలో పంచాంగకర్తలు నిర్ధారించిన ఈ ముహూర్త వివరాలను అధికారిక అనుమతి కోసం దేవదాయ శాఖ అధికారులు ప్రభుత్వానికి పంపారు. ఈ నెల 20వ తేదీ నుంచి డిసెంబర్‌ 1వ తేదీ మధ్య 12 రోజుల పాటు పుష్కరాలు కొనసాగుతాయి.
 గతంలో 2008లో తుంగభద్ర పుష్కరాలు జరిగాయి.తుంగభద్ర పుష్కరాల్లో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పాల్గొననున్నారు. ఈ నెల 20వ తేదీ నుంచి డిసెంబర్‌ ఒకటవ తేదీ వరకు తుంగభద్ర పుష్కరాలు జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో 20వ తేదీన కర్నూలు జిల్లాలోని సంకల్‌బాగ్‌ పుష్కర ఘాట్‌ వద్ద శాస్త్రోక్తంగా జరిగే కార్యక్రమాల్లో ముఖ్యమంత్రి జగన్‌ పాల్గొంటారు. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: