బుల్లి పిట్ట: ఇలా చేస్తే..రూ.2 వేలకే 5G స్మార్ట్ ఫోన్..!
ప్రముఖ ఈ కామర్స్ ప్లాట్ ఫామ్ లలో ఒకటైన ఫ్లిప్ కార్ట్ OPPO K-13 X5G మొబైల్ పై భారీ డిస్కౌంట్ ని ప్రకటించింది. ఈ ఆఫర్లు, భారీ డిస్కౌంట్ ,ఎక్స్చేంజ్ వల్ల కేవలం ఈ మొబైల్ రూ.2000 రూపాయలకే మనం సొంతం చేసుకోవచ్చు. 4GB RAM+128GB స్టోరేజ్ వేరియంట్ మొబైల్ ధర విషయానికి వస్తే రూ.15,999 ఉన్నది.. ఇప్పుడు కేవలం ఈ మొబైల్ రూ.11,999 రూపాయలకి తగ్గింది. అంటే సుమారుగా 4000 రూపాయల వరకు తగ్గింపు. వీటికి తోడు hdfc బ్యాంకు కార్డు ద్వారా చెల్లించినట్లు అయితే అదనంగా 1500 రూపాయలు తగ్గుతుంది. దీంతో ఈ మొబైల్ రూ.10,499 రూపాయలకే లభిస్తుంది. ఎక్సేంజ్ ఆఫర్ ఉపయోగించుకుంటే 8,350 రూపాయల వరకు మనం ఆదా చేసుకోవచ్చు. ఈ ఆఫర్ మనం ఎక్సేంజ్ కింద పెట్టే మొబైల్ మీద ఆధారపడి ఉంటుంది. దీంతో మనం OPPO K-13 X5G రూ.2,149 రూపాయలకే మనం పొందవచ్చు.
OPPO K-13 X5G ఫీచర్స్ విషయానికి వస్తే..6.67 అంగుళాల హెచ్డి డిస్ప్లే..1604X720 పిక్చర్ క్వాలిటీ.. 50 మెగా పిక్సెల్ ప్రైమరీ కెమెరా.. ఫ్రంట్ కెమెరా 8 మెగాఫిక్ సెల్ కలదు. G57 GPU తో కూడిన మీడియా టెక్ డైనమిన్సిటి 6300 ప్రాసెస్ కలదు. ఆండ్రాయిడ్ 15 ఆధారంగా పనిచే. ఈ మొబైల్ వేరియేషన్స్ బట్టి ధరలలో మార్పులు ఉంటాయి. 45 W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది..6000 MAH సామర్థ్యం కల బ్యాటరీ కలదు.