లాంచ్‌కి సిద్ధమైన ఎక్స్ టీవీ.. మస్క్ మరో సంచలనం..

praveen

ఒకప్పుడు ప్రింట్ మీడియాకి చాలా విశ్వసనీయత ఉండేది. అప్పట్లో జర్నలిస్టులు, వార్తల సంస్థల్లో పని చేసేవారు. నిజాలను ఉన్నది ఉన్నట్లుగా రాసేవారు. ఇది కొంతమంది రాజకీయ పార్టీలకు నష్టం కలిగించేది. అలాంటి రాజకీయ నాయకులు వార్తా సంస్థల ఎడిటర్లకు రాజ్యసభ సీట్లు ఇచ్చి తమకు అనుకూలంగా వార్తలు రాయించుకోవడం ప్రారంభించారు. ఇది తెలుసుకున్న వార్తా సంస్థల యజమానులు మండిపడ్డారు. తామే డబ్బులు ఇచ్చి వార్తా సంస్థలను నడుపుతున్నామని కాబట్టి తమకే రాజ్యసభ సీట్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. దాంతో రాజకీయ నాయకులు ఒప్పుకున్నారు ఇక అప్పటినుంచి మీడియా సంస్థల యజమానులు చెప్పినట్లు వారి కింద పనిచేసే జర్నలిస్టులు రాజకీయ నాయకులకు అనుకూలంగా వార్తలు రాస్తూ వస్తున్నారు. ప్రింట్ మీడియాని ప్రజలు నమ్మడం కూడా తగ్గించారు. టీవీలు కూడా అలానే తయారయ్యాయి.
ఒకప్పుడు వార్తను వార్త లాగానే కవర్ చేసేవారు కానీ ఇప్పుడు ప్రజలను ఆకట్టుకొని వ్యూస్ పెంచుకునేలాగా వార్తలు రాస్తున్నారు. అంతేకాదు కొన్ని మీడియా సంస్థలు నిర్దిష్ట రాజకీయ పార్టీకి మేలు చేసేలాగా వార్తలు వండి వారిస్తున్నాయి. మనదేశంలోనే కాదు అన్ని దేశాల్లో కూడా ఇలాంటి పరిస్థితి నెలకొన్నది. ఉదాహరణకు అమెరికాలో ట్రంప్ కి వ్యతిరేకంగా చాలా మీడియా సంస్థలు వార్తలు రాసుకొచ్చాయి. బైడెన్ కు అనుకూలంగా మాత్రమే న్యూస్ రాసాయి. తద్వారా ఓటర్లను ప్రభావితం చేసి బైడెన్ పార్టీని గెలిపించాలని చూశాయి కానీ ట్రంప్‌ను అప్పట్లో ట్విట్టర్ లో కూడా బ్యాన్ చేశారు.
సరిగ్గా ఈ టైమ్‌లో ఎలాన్‌ మస్క్ ట్విట్టర్ కొనుగోలు చేసి ట్రంప్ ను అన్ బ్లాక్ చేశారు. అంతే కాదు ఆయనకి అనుకూలంగా చాలా ప్రచారం చేశారు. అయినా సరే ట్రంప్ కి వ్యతిరేకంగా అక్కడ మీడియా ఎన్నో కథనాలు రాస్తోంది. వీటన్నిటికీ చెక్ పెట్టాలంటే ఒక మీడియా హౌస్ స్థాపించాలని ఎలాన్‌ మస్క్ భావిస్తున్నాడట. అందుకే ఎక్స్ టీవీ ప్రారంభించడానికి రెడీ అయినట్లుగా వార్తలు వస్తున్నాయి. ఈ ఎక్స్ టీవీ ట్రంప్ కి వ్యతిరేకంగా వచ్చే నిరాధారా వార్తలన్నిటినీ పటాపంచలు చేస్తుంది. తద్వారా ఆయన ఇమేజ్ దెబ్బ తినకుండా కాపాడగలుగుతుంది. మస్క్, ట్రంప్ ఇద్దరూ వారి సొంత లాభం కోసం కలిసి పనిచేస్తున్నారనేది అందరికీ తెలిసిన విషయమే. వారికి ఎలాంటి ఆటంకం కలగకుండా ఉండాలంటే ఎక్స్ టీవీ ఉండాల్సిందే అనేది మస్క్ ఆలోచన అని పొలిటికల్ అనలిస్టులు పేర్కొంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

XTV

సంబంధిత వార్తలు: