బుల్లి పిట్ట: ఈ ఒక్క సెట్టింగ్ ఆఫ్ చేస్తే.. మొబైల్ లో ఏం చేసిన సేఫ్..!

frame బుల్లి పిట్ట: ఈ ఒక్క సెట్టింగ్ ఆఫ్ చేస్తే.. మొబైల్ లో ఏం చేసిన సేఫ్..!

Divya
ప్రస్తుతం ఉన్న కాలంలో చాలామంది స్మార్ట్ మొబైల్ ని ఎన్నో రకాలుగా ఉపయోగిస్తూ ఉంటారు. అయితే ఈ స్మార్ట్ మొబైల్ వల్ల ఎన్ని లాభాలు ఉన్నాయో అదే స్థాయిలో నష్టాలు కూడా ఉన్నాయని చెప్పవచ్చు. చాలామంది మొబైల్ లో ఉండేటువంటి ఫీచర్స్ ని ఉపయోగించి ఎక్కడెక్కడ ఏమేమి చేస్తున్నామనే విషయాలను కూడా తెలుసుకుంటూ ఉంటారు. ముఖ్యంగా కొంతమంది మన కదలికను తెలుసుకోవడానికి మొబైల్ ని అనుగుణంగా మార్చుకుంటూ ఉంటారు. అయితే ఇలాంటి ట్రాకింగ్ ఆపడానికి సైతం ఒక చిన్న సెట్టింగ్ చేస్తే సరిపోతుందట వాటి గురించి చూద్దాం.

ప్రస్తుతం ఉన్న స్మార్ట్ మొబైల్స్ లో డిజిటల్ వెల్ బీయింగ్ ఫీచర్ బిల్ట్ ఇన్ గా వచ్చేస్తాందట.. ఈ స్పెసిఫికేషన్స్ తోనే యూజర్స్ సైతం తమ మొబైల్ ని ఎంతసేపు ఉపయోగిస్తున్నామో ఏ యాప్స్ ని ఎక్కువ సేపు మనం ఉపయోగిస్తున్నామనే విషయాన్ని మనం చూడవచ్చు. ఇది మొబైల్ యూజర్స్ చేసే విషయాలన్నీ కూడా ట్రాక్ చేస్తుందట. దీన్ని మనం యాక్సిస్ చేస్తూ ఉంటాము.

మొబైల్లో సెట్టింగ్ పైన క్లిక్ చేసిన తర్వాత.. అక్కడ సెర్చింగ్ లో డిజిటల్ వెల్ బీయింగ్ అండ్ పేరెంటల్ కంట్రోల్స్ అనే ఆప్షన్ ని ఎంపిక చేసుకోవాలి.
ఆ తర్వాత మొబైల్ ఎంతసేపు యూజ్ చేస్తున్నామో ఎక్కడ ఏ యాప్ ని ఎక్కువ సేపు ఉపయోగిస్తున్నాము వంటి వివరాలను మనం చూడవచ్చు. అయితే మన సమాచారం మొత్తం కూడా గూగుల్ చూస్తూ ఉంటుంది. డిజిటల్ వెల్ బీయింగ్ ఫీచర్ ఆఫ్ చేసామంటే చాలట. దీనివల్ల ఎవరు ఎలాంటి యాప్స్ ఉపయోగిస్తున్నారు ఎంత టైం ఉపయోగిస్తున్నారు అనే విషయాన్ని డిలీట్ చేస్తుందట. దీనివల్లే ప్రేవసికి భంగం వాటిల్లకుండా ఉంటుందట. అయితే ఈ ఆప్షన్ ని ఎలా ఆఫ్ చేయాలో చూద్దాం.

మొదట మొబైల్ సెట్టింగ్లో డిజిటల్ వెల్ బీయింగ్ అనే ఫీచర్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత.. త్రీ డాట్స్ ఐకాన్ పైన క్లిక్ చేసి.. అక్కడ యూజెస్ డేటా యాక్సెస్ లేదా మేనేజ్ యువర్ డేటని ఆప్షన్ పైన క్లిక్ చేసిన తర్వాత.. డైలీ ఫోన్ యూజెస్ అనే ఆప్షన్ ఉంటుందట. ఇది ఆన్ చేసి ఉంటే ఆఫ్ చేయడం మంచిది. దీనివల్ల ఎవరు కూడా మన మొబైల్ నెంబర్ ట్రాక్ చేయలేరు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: