అంతరిక్షంలో చిక్కుకుపోయిన సునీతా విలియమ్స్?

నెల రోజులకు పైగా అంతరిక్షంలో చిక్కుకున్న సునీతా విలియమ్స్ కి సంబంధించి ఒక అప్ డేట్ వచ్చింది. నాసా చాలా నిరాశాజనకమైన వార్తని వినిపించింది. వ్యోమగాములు, బోయింగ్ క్యాప్యూల్స్ అంతరిక్ష కేంద్రానికి తిరిగి రావడానికి ఇంకా తేదీని ఖరారు చేయలేదని నాసా తెలిపింది.

సునీతా విలియమ్స్ తో టెస్ట్ ఫెలెట్ బుచ్ విల్మోర్ ఒక నెల కంటే ఎక్కువ కాలం అంతరిక్షంలో చిక్కుకున్నారు. ఈ నిరీక్షణ ఎంత కాలం కొనసాగుతుందనే విషయంపై ఎటువంటి నిర్ధారణ కాలేదు. టెస్ట్ ఫైలెట్ బుచ్ విల్మోర్, సునీతా విలియమ్స్ తో కలిసి జూన్ 5న అంతరిక్షంలోకి వెళ్లారు. వీరిద్దరూ వెళ్లిన మిషన్ ఒక వారం మాత్రమే అంతరిక్షంలో ఉండాలి. కక్ష్యలో ఉన్న ల్యాబ్ ను సందర్శించాలి.

అయితే అంతరిక్ష నౌకలో హీలియం గ్యాస్ లీక్, థ్రస్టర్ ల వైఫల్యం కారణంగా వీరిద్దరూ అక్కడ చిక్కుకుపోయారు. ఇప్పుడు తిరిగి భూమి మీదకు తీసుకొచ్చే ప్రయత్నాలు జరుగుతున్నాయి. లిఫ్ట్ ఆఫ్ అయిన ఒక రోజు తర్వాత జూన్ 6న క్యాప్సూల్స్ అంతరిక్ష కేంద్రానికి చేరుకోవడంతో ఐదు థ్రస్టర్లు విఫలం అయ్యాయి. దీంతో వీరిద్దరూ అంతరిక్షంలో కూరుకుపోయి నెల రోజులు అయింది.

బోయింగ్ క్యాప్సూల్స్ సమస్యలను తొలగించడం కోసం టెస్ట్ ఫైలెట్ బుచ్ విల్మోర్, సునీతా విలియమ్స్ కలిసి తమ పనిని పూర్తి చేసే అంతరిక్షంలో ఉండవలిసి ఉంటుందని నాసా అధికారులు తెలిపారు. నాసా కమర్షియల్ క్రూ ప్రోగ్రాం మేనేజర్ స్టీవ్ స్టిచ్ మాట్లాడుతూ.. విల్మోర్, సునీతాలు భూమికి వచ్చే తేదికి సంబంధించి ఎటువంటి ప్రకటన చేయడానికి మిషన్ మేనేజర్లు సిద్ధంగా లేరని చెప్పారు.

ఇంజినీర్లు గత వారం న్యూ మెక్సికో ఎడారిలో స్పేర్ థ్రస్టర్స్ పరీక్షను పూర్తి చేశారు. డాకింగ్ సమయంలో ఏమి తప్పు జరిగిందో అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. విచారణలో హీలియం లీక్, థ్రస్టర్స్ పేలవమైన సీల్ కారణంగా అన్ని సమస్యలు సంభవించాయని.. అయితే తర్వాత ఏం చేయాలి అనే విషయంపై విచారణ జరుగుతోందని అధికారులు తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: