బుల్లి పిట్ట: మొబైల్ ఛార్జింగ్ లో 20:80 అంటే ఏమిటో తెలుసా..?

Divya
ప్రస్తుతం ఎక్కువగా స్మార్ట్ మొబైల్ యుగమే నడుస్తూ ఉన్నది.. స్మార్ట్ ఫోన్ల పైన ప్రజలలో మంచి క్రేజీ కూడా పెరుగుతూనే ఉన్నది. అయితే చాలా మంది మొబైల్ ఛార్జింగ్ పెట్టడం వంటివి అసలు మర్చిపోనే మర్చిపోరు. ఒకవేళ మొబైల్లో ఛార్జింగ్ లేకపోతే ఇక ఆ రోజంతా కూడా ఎలా అనే పరిస్థితికి జారిపోయారు ప్రజలు. అయితే ఇలాంటి పరిస్థితులలో స్మార్ట్ మొబైల్ ని ఎలా ఛార్జ్ చేయాలో చాలామందికి తెలియకపోవచ్చు. ముఖ్యంగా మనం మొబైల్ బ్యాటరీ సరిగ్గా ఛార్జ్ చేస్తే బ్యాటరీ జీవితాన్ని సైతం అవి ఎక్కువ కాలం వచ్చేలా చేస్తూ ఉంటుంది.

ముఖ్యంగా మనం మన బ్యాటరీ కి ఛార్జింగ్ చేసేటప్పుడు గమనించాల్సిన ముఖ్య విషయం ఏమిటంటే 80% కి ఎక్కువగా చార్జింగ్ చేయకపోవడమే మంచిది. అలాగే 20% పడిపోయే వరకు చార్జింగ్ పెట్టకుండా ఉండకూడదు. ఇలా చేయడం వల్ల మొబైల్ కూడా పాడైపోతుందని చెప్పవచ్చు. వాస్తవానికి మొబైల్ బ్యాటరీ జీరో శాతానికి చేరుకున్నప్పుడు మాత్రమే చాలామంది చార్జింగ్ చేయాలనుకుంటూ ఉంటారు కానీ అది సరైన పద్ధతి కాదని నిపుణుల సైతం తెలియజేస్తున్నారు.

అదే సమయంలో 100% పూర్తి అవ్వగానే చార్జర్ పిన్ను తీసేయాలని చాలామంది అనుకుంటూ ఉంటారు. ఇలా చేయడం తప్పు..ఫోన్ బ్యాటరీ పూర్తిగా డిశ్చార్జ్ చేయకూడదని లేదా పూర్తిగా చార్జ్ చేయకూడదని నిపుణులు సైతం వెల్లడిస్తున్నారు. ఎప్పుడైనా సరే మొబైల్ ఛార్జింగ్ ని 20:80 వరకు నిష్పత్తి ఉండేలా గుర్తించుకోవాలి.. కొంతమంది నిపుణులు బ్యాటరీని 90 శాతం వరకు చార్జ్ చేయవచ్చని చెబుతూ ఉంటారు.. కానీ 20:80 శాతం నియమాన్ని పాటిస్తే బ్యాటరీ లైఫ్ మెరుగుపరచడమే కాకుండా జీవితకాలం వస్తుందట.. ఫోన్లో ఫుల్ ఛార్జింగ్ పెట్టినప్పటికీ అది ఒత్తిడిని పెంచడానికి. అంతేకాకుండా కంపెనీ వాళ్ళు ఇచ్చిన చార్జర్ ని మాత్రమే ఉపయోగించాలని నిపుణులు తెలుపుతున్నారు. ఇతర చార్జర్లను వాడితే త్వరగా పాడైపోతుందట.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: