టాటా.. టెస్లా కలిస్తే.. ఇండియాలో అద్భుతాలే?

ప్రపంచ టెక్నాలజీ రంగంలో అతిపెద్ద డీల్.. ఇండియాలోని టాప్ కంపెనీ టాటాతో  ప్రపంచ దిగ్గజ కంపెనీ టెస్లా ఒప్పందం చేసుకున్నాయి. ఇండియాలో సెమీ కండెక్టర్ చిప్స్ తయారీకి సంబంధించి టాటా, టెస్లా కలిసి పెద్ద యూనిట్ ను ఏర్పాటు చేయబోతున్నాయి. టెస్లాకు కావాల్సిన చిప్స్ టాటా ఫ్యాక్టరీల నుంచి ఎగుమతి కాబోతున్నాయి.

ఇక టాటా విషయానికొస్తే.. ఇప్పటికే సెమీ కండెక్టర్ చిప్ప్ తయారీ లో యూనిట్స్ ని ఏర్పాటు చేస్తోంది.  టాటా ఎలక్ర్టానిక్ ఆధ్వర్యంలో.. హోసూర్, అసోం, ధలేరా ప్రాంతాల్లో తయారీ యూనిట్లు ఏర్పాటు చేస్తోంది. దీని కోసం ఇప్పటికే  1400 కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టింది టాటా. ఏప్రిల్ నెలలో టెస్లా అధినేత ఎలన్ మస్క్ ఇండియా పర్యటనకు రానున్నారు. ఈ సందర్భంగా టెస్లా, టాటా డీల్ పై ప్రకటన చేయనున్నట్లు సమాచారం. టాటా ఎలక్ర్టానిక్ లో ఎలన్ మస్క్ ఎంత పెట్టుబడి పెడుతున్నారు.. ఎంత వాటా తీసుకుంటున్నారు.. డీల్ పూర్తి వివరాలు ఏంటి అనేది మాత్రం రెండు కంపెనీలు వెల్లడించలేదు.

ఇప్పటికే సెమీ కండక్టర్ చిప్స్ కొరత ప్రపంచ దేశాలకు వేధిస్తోంది. ప్రస్తుతం ఈ మార్కెట్ లో తైవాన్ వాటా ఎక్కువ. అంతకు మించి డిమాండ్ ఎక్కువగా ఉంది. సెమీ కండక్టర్ చిప్స్ కొరత వల్ల కార్ల తయారీ ఆలస్యం అవుతోంది. అదే విధంగా టీవీలు, ఇతర హోం అప్లయిన్సెస్ లో వినియోగించే చిప్స్ కొరత ఎక్కువగా ఉంది.

దీంతో భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని టాటా ఈ తయారీ రంగంపై దృష్టి సారించింది. ఈ క్రమంలో ఎలన్ మస్క్ ఈవీ తయారీ సౌకర్యాలు సహా దేశంలో పెట్టుబడులు పెట్టేందుకు ఉత్సాహంగా ఉన్నారు.  టెస్లా తన గ్లోబల్  కార్యకలాపాలలో ఉపయోగించే సెమీ కండెక్టర్ ల చిప్ లను కొనుగోలు చేయడానికి టాటా ఎలక్ర్టానిక్ తో వ్యూహాత్మక ఒప్పందంపై సంతకం చేసినట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: