బుల్లి పిట్ట: నోకియా బ్రాండ్ నుంచి కొత్త ఫీచర్స్ ఫోన్స్ లాంఛ్..!!

Divya
నోకియా బ్రాండెడ్ కలిగిన కీప్యాడ్ మొబైల్స్ ఒక సరి కొత్త ప్రపంచాన్ని సృష్టించాయి. ఆ తర్వాత ఆండ్రాయిడ్ మొబైల్స్ కింద నోకియా నుంచి విడుదలైన కూడా ఇవి పెద్దగా సక్సెస్ కాలేకపోయాయి. ప్రస్తుతం ఉన్న గ్లోబల్ మార్కెట్లో ఉన్నటువంటి పోటీలో నోకియా మొబైల్ నిలవలేక పోతోంది. అయినప్పటికీ కూడా నోకియా ఫీచర్ మొబైల్స్ స్మార్ట్ మొబైల్స్ కూడా ఎప్పటికప్పుడు లాంచ్ అవుతున్నాయి. తాజాగా HMD గ్లోబల్ మళ్లీ నోకియా ఫీచర్ మొబైల్ ని సైతం లాంచ్ చేసింది.. నోకియా 6310(2024).. నోకియా 5310(2024).. నోకియా 230 (2024) ఆడే మూడు మొబైల్స్ ని విడుదల చేసింది.
అయితే ఈ మూడు పనులు ప్రత్యేకమైన డిజైన్తో సరికొత్త ఫీచర్స్ తో వస్తున్నాయి. వీటి గురించి పూర్తిగా తెలుసుకుందాం.
1).NOKIA 6310:
నోకియా బ్రాండెడ్ నుంచి వచ్చిన ఈ మొబైల్ బ్యాటరీ 1450 MAH సామర్థ్యంతో లాంచ్ చేయబడింది. ఈ మొబైల్ బ్యాకప్ కూడా ఎక్కువ రోజులు అందిస్తుందట.. అలాగే  USB TYPE-C చార్జింగ్ సపోర్ట్ కూడా చేస్తుంది. వీటితో పాటు ఎల్ఈడి ఫ్లాష్ సపోర్టుతో..VGA కెమెరా కూడా కలిగే ఉంటుంది..2.8 అంగుళాల ఎల్సిడి డిస్ప్లే డ్యూయల్ సిమ్ ఆప్షన్ కూడా ఉన్నది.
2).NOKIA 5310:
నోకియా నుంచి వచ్చిన ఈ మొబైల్.. యూనిసోక్ 6531F చీప్ సెట్ తో కలదు. ఈ మొబైల్ పొడుగు వెడల్పు ఎక్కువగా ఉండడం గమనార్హం.2.8 అంగుళాల ఎల్సిడి డిస్ప్లే కూడా కలదు..1450 MAH  సామర్థ్యంతో పనిచేస్తుంది..FM రేడియా డ్యూయల్ స్పీకర్. USB TYPE-C చార్జింగ్ సపోర్టుతో పని చేస్తుంది.

NOKIA 230:
ఈ స్మార్ట్ మొబైల్ ఎల్ఈడి ఫ్లాష్ సపోర్ట్ తో 2MP కెమెరా కలిగి ఉన్నది..2.8 అంగుళాల డిస్ప్లే తో కలదు.6531F చిప్ సెట్ తో పనిచేస్తుంది. బ్యాటరీ విషయానికి 1450 MAH సామర్ధ్యంతో..USB పోర్ట్ కలదు.
 ప్రస్తుతం ఈ మూడు కొత్త ఫీచర్ మొబైల్స్ మాత్రమే లాంచ్ అయ్యాయి. అయితే వీటి ధరలు ఇంకా తెలియజేయలేదు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: