బుల్లి పిట్ట: ఓటర్ ఐడి కార్డ్ డౌన్లోడ్ ఇలా చేసుకోండి..!

Divya
మరి కొన్ని వారాలలో ఆంధ్రప్రదేశ్ శాసన సభ మరియు లోక్సభ ఎన్నికలు సైతం మొదలు కాబోతున్నాయి.. 18 ఏళ్లు నిండిన యువతి ,యువకులు సైతం తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి ఓటర్ ఐడి కార్డును ఉపయోగించుకోవలసి ఉంటుంది.. దీంతో ఇటీవలే ఓటర్లు సౌకర్యం కోసం భారత ఎన్నికల సంఘం..E-EPIC .. ఎలక్ట్రానిక్ ఎలక్ట్రో కుర్రాళ్ళు ఫోటో ఐడెంటి కార్డు అనేటువంటి డిజిటల్ ఓటర్ ఐడి కార్డుని సైతం తీసుకోవచ్చారు..

డిజిటల్ ఓటర్ గుర్తింపు కార్డు అనగానే.. చాలామందికి అవగాహన ఉండకపోవచ్చు.. అయితే ఇది పిడిఎఫ్ ఫార్మాట్లో ఉండేటువంటి ఓటర్ ఐడి కార్డు డాక్యుమెంట్.. దీన్ని మొబైల్లో చాలా సులువుగా మనం సేవ్ చేసుకొని ఓటర్ కార్డుగా మనం ఉపయోగించుకోవచ్చు. ఈ డిజిటల్ ఓటర్ గుర్తింపు కార్డు తమ యొక్క స్మార్ట్ మొబైల్ లో కూడా సేవ్ చేసుకోవచ్చు.
అయితే ఈ డిజిటల్ ఓటర్ కార్డుని ఎవరు ఉపయోగించవచ్చు అంటే.. చెల్లుబాటు అయ్యేటువంటి EPIC నెంబర్ను కలిగి ఉన్న ఓటర్లు మాత్రమే ఈ డిజిటల్ ఐడి కార్డు ని దరఖాస్తు చేసుకోవచ్చు.. దీనివల్ల వెంటనే పిడిఎఫ్ వర్షన్ లో మొబైల్ ఫోన్లో ఓటర్ కార్డుని పొందవచ్చు. ఒకవేళ ప్రత్యేకమైన క్యూఆర్ కోడ్ స్కాన్ చేయడం వల్ల కూడా వీటిని యాక్సెస్ చేయవచ్చు
.
1).ఎలా దరఖాస్తు చేసుకోవాలంటే:
ముందుగా మనం నేషనల్ ఓటర్ సర్వీస్ పోర్టల్ ఆయన..NVSP వాటిలో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి.
అక్కడ అవసరమైన వివరాలను అందించి కొత్త ఓటర్ల కోసం దరఖాస్తు ఫారం -6 పూర్తి చేసిన తర్వాత..NVSP వెబ్సైట్లోకి వెళ్లి దరఖాస్తు స్థితిని ట్రాక్ చేసుకోవాలి.

డిజిటల్ ఓటర్ ఐడి కార్డ్ సిద్ధమైన తర్వాత..NVSP వెబ్సైట్ ద్వారా డౌన్లోడ్ చేసుకోవచ్చు
1).డిజిటల్ ఓటర్ ఐడి కార్డ్ డౌన్లోడ్ చేయాలి అంటే అధికారిక వెబ్సైట్..eci gov.in/e-epic లో వెళ్లాలి.

e-Epic డౌన్లోడ్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయాలి..
అక్కడ లాగిన్ వివరాలు 10 అంకెల..epic నీ ఎంటర్ చేయాలి.. ధ్రువీకరించడం కోసం మీ స్మార్ట్ మొబైల్ కి ఓటీపీ కూడా వస్తుంది.

అలా వచ్చిన ఓటీపీతో పాటు ఓటర్ గుర్తింపు కార్డుని ధ్రువీకరించాలి. అప్పుడే డిజిటల్ ఐడి కార్డ్ మీ మొబైల్లో పిడిఎఫ్ వర్షన్ లో సేవ్ అవుతుంది.

అలాగే ఓటర్లకు సంబంధించి ఎలాంటి మిస్టేక్స్ ఉన్నా కూడా ఇందులోనే చేసుకోవాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: