బుల్లి పిట్ట: జులై 1 నుంచి సిమ్ కార్డులపై కొత్త నిబంధనలు..!!
వివిధ భాగస్వామ్యులతో చర్చలు జరిపిన అనంతరం సరికొత్త మార్గదర్శకాలను తీసుకువచ్చింది ట్రామ్.. జులై 1వ తేదీ నుంచి ఈ నిబంధనలు అమలులోకి రాబోతున్నాయని తెలిపారు.. మోసాల కోసం సిమ్ స్వాఫ్ ,సిమ్ రీప్లేస్మెంట్ కి పాల్పడుతున్న వ్యక్తులను సైతం అరికట్టేందుకే ఇలా చేస్తున్నామని వెల్లడిస్తున్నారు. మొత్తం మొబైల్ నెంబర్ పోర్టబిలిటీ ప్రక్రియ అనంతరం యూనిక్ పోర్టింగ్ కోడ్ కీలక దశ అన్నట్లుగా తెలియజేస్తున్నారు. తాజాగా విడుదల చేసిన మార్గాదర్శకాల వల్ల 7 రోజుల వ్యవధిలోనే టెలికమ్ ఆపరేటర్లు యూపీఐ కోడ్ ని జారీ చేయలేవని ట్రామ్ వివరించారు..
దీంతో 8 అంకెలతో కూడిన యూపీసీ కోడ్ విషయంలో కూడా చాలా పశిష్టమైన భద్రత చర్యలు తీసుకోవాలని వివరించారు.. ప్రస్తుతం వినియోగదారులు సర్వీస్ ప్రొవైడ్ పట్ల కూడా చాలా అసంతృప్తిగా ఉన్నట్లు అందుకే ఒక టెలికం సంస్థ నుంచి మరొక టెలికం ఆపరేటర్లకు మారుతున్నారనే విషయాన్ని గుర్తించారట. ఈ సమయంలోనే మొబైల్ నెంబర్ పోర్టబిలిటీ వినియోగం కస్టమర్లకు కల్పించే అవకాశం ఉంటుందని ట్రామ్ వెల్లడించారు..అయితే ఈ విధానం కొన్ని మూసపూరితమైన కార్యకలాపాలకు కూడా ఉపయోగిస్తున్నారని అందుకే వినియోగదారులు ప్రయోజనం కోసమే తాజాగా పలు రకాల మార్పులు తీసుకు వచ్చినట్లు తెలుస్తోంది. దీనివల్ల ఒక వ్యక్తి మీద ఉన్న నెంబర్ మరొక వ్యక్తి తీసుకోవడానికి అవకాశం ఉండదు.