బుల్లి పిట్ట: ఎండాకాలంలో ఏసి ఆన్ చేసే ముందు ఈ విషయాలను తెలుసుకోండి..!!
మనం ఏసిని ఆన్ చేసే ముందు ఏసీలో అమర్చినటువంటి ఫిల్టర్ గాలిలోని దుమ్ముదూలని చేరుతుంది.. ఆన్ చేసే ముందు కచ్చితంగా ఈ ఫిల్టర్ ని శుభ్రం చేయాలి.. ఆ తర్వాతే ఏసీ కూలింగ్ సామర్థ్యం పెరుగుతుంది.. ఈ ఫిల్టర్ లో డస్ట్ ఉండడం వల్ల చల్లటి గాలి ఎక్కువగా బయటకు రాదు.
ఒకవేళ స్లిప్ట్ ఏసి అవుట్డోర్ యూనిట్ ఫ్యాన్ యూనిట్ పైన దుమ్ము దులి ఉన్నట్లు అయితే కచ్చితంగా వాటిని శుభ్రం చేయాలి లేకపోతే ఏసీ కూలింగ్ సిస్టం పైన తీవ్రమైన ప్రభావం పడుతుంది.
ఏసీలో రెండు మూడు నెలలు స్విచ్ ఆఫ్ చేయబడి ఉంటే కొన్నిసార్లు స్విచాన్ చేసిన తర్వాత.. ఏసీ యొక్క పనితీరు మరియు ఉష్ణోగ్రత కూడా మారవచ్చు.. అందుకే ఏసిని ఆన్ చేసిన తర్వాత ఉష్ణోగ్రతను ఒకసారి చెక్ చేసుకోవడం మంచిది.
కండెన్సర్ ఆవిరి, పొరేటర్ కాయిల్స్ ఏసీ ని ఆఫ్ చేయడం వల్ల మురికిగా ఉంటాయి.. అలాంటి సందర్భాలలో మళ్ళీ ఏసీని ఆన్ ఆన్ చేసే కంటే ముందు వాటిని శుభ్రం చేసుకోవడం మంచిది..
ముఖ్యంగా వైర్లను చెక్ చేసుకోవడం మంచిది.. ఏవైనా ఎలుకలు లేకపోతే కొన్ని సందర్భాలలో వైర్లు సైతం కట్ అయి ఉంటాయి.. ఏసీ ఆఫ్ లో ఉండడం వల్ల వీటిని మనం గమనించకపోవచ్చు.. దీనివల్ల ఏసీలో కూడా సమస్యలు ఏర్పడతాయి.. ఆన్ చేసే ముందు ఒకసారి కనెక్షన్ చెక్ చేసుకోవడం మంచిది.