బుల్లి పిట్ట: వాట్సాప్- బిజినెస్ వాట్సాప్ కి తేడా ఏంటో తెలుసా..?

Divya
ప్రస్తుతం ఉన్న రోజుల్లో ప్రతి ఒక్కరం కూడా ఎక్కువగా వాట్సాప్ వినియోగిస్తూనే ఉన్నాము.. వీటి వినియోగించే వారి సంఖ్య రోజురోజుకి పెరుగుతూనే ఉన్నది. కస్టమర్లకు సైతం వాట్సాప్ సంస్థ కూడా ఎప్పటికప్పుడు సరికొత్త ఫీచర్లను అందుబాటులోకి తీసుకువస్తూనే ఉన్నది. ఇప్పటికే ఎన్నో రకాల ఫీచర్స్ ని సైతం అందుబాటులోకి తీసుకువచ్చారు. అయితే కొంతమంది వాట్సాప్ యూస్ చేస్తే మరి కొంతమంది ఎక్కువగా బిజినెస్ వాట్సాప్ ను యూస్ చేస్తూ ఉంటారు.. అయితే ఈ రెండిటికీ గల తేడా ఏంటి అనే విషయం తెలియకపోవచ్చు. వాటి గురించి చూద్దాం.
ఈ రెండిటికి మధ్య తేడా ఏంటి అనే విషయానికి వస్తే స్నేహితులు కుటుంబ సభ్యులతో వ్యక్తిగత కమ్యూనికేషన్ కోసం ఎక్కువగా మనం వాట్సాప్ ని ఉపయోగిస్తాము.. వాట్సాప్  బిజినెస్ ద్వారా వ్యాపారుల తమ కస్టమర్లతో కమ్యూనికేషన్ గా ఉండేందుకు ఈ వాట్సాప్ ను ఎంచుకుంటారు.వాట్సాప్  బిజినెస్ అనేది చిన్న వ్యాపారులకు ఒక ఫ్రీ ఆప్షన్ వంటిది. ఇందులో పేమెంట్ API వంటి పరిష్కారాన్ని కూడా కలిగి ఉంటుందట. అంతేకాకుండా వాట్సాప్ బిజినెస్ లోగోలో బి అని కూడా రాసి ఉంటారు.

ఈ బిజినెస్ వాట్సాప్ ద్వారా నేరుగా కాల్ పేమెంట్ అనే ఆప్షన్ ని కూడా సెట్ చేసుకోవచ్చు.. సాధారణ వాట్సాప్ లో ఇలాంటి ఫీచర్స్ ఉండవు బిజినెస్ వాట్సాప్ ద్వారా ఒకేసారి ఎంతమందికైనా సరే ఈ సందేశాలను పంపవచ్చు.. వాట్సప్ బిజినెస్ ద్వారా వ్యాపారాలు వ్యాపార నిపుణులు ఎన్నో ప్రశ్నలకు సైతం ఆటోమేటిక్ జవాబు ని సైతం సెట్ చేసు కోవచ్చు.. ఏదైనా స్వాగత సందేశం లేదా ఇతర సమాచారాన్ని ఆటోమేటిక్గా రిప్లై ఇచ్చేయాల మనం సెట్ చేసుకోవచ్చు. సాధారణ వాట్సాప్ లో ఇలాంటివి ఏవి ఆప్షన్స్ ఉండవు కనుక.. అందుకే వాట్సప్ వాట్సప్ బిజినెస్ కి గల తేడాలు ఇవే.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: