బుల్లి పిట్ట: ఒక మొబైల్ యూజర్స్ ఎంతకాలం వాడొచ్చో తెలుసా..?

Divya
రోజువారి జీవితం లో స్మార్ట్ మొబైల్ అనేది కచ్చితంగా ఉపయోగపడేటువంటి ఒక వస్తువుగా మారిపోయింది. చాలామంది మొబైల్ ప్రియులు ఏదో ఒక సరికొత్త మొబైల్ వస్తుందంటే చాలు కొత్త మొబైల్ ని కొనడానికి ఇష్టపడుతూ ఉంటారు.. అసలు ఒక మొబైల్ ని తీసుకున్న తర్వాత వాటిని ఎంత కాలం ఉపయోగించుకోవచ్చు..కొత్త మొబైల్ ఎప్పుడు తీసుకోవాలి అనే విషయాలు చాలా మందికి తెలియకపోవచ్చు.. వాటి గురించి ఇప్పుడు పూర్తి వివరాలు తెలుసుకుందాం.

స్మార్ట్ మొబైల్ కి ఎక్స్పైర్ డేట్ అనేది ఏమి ఉండదట. కానీ మొబైల్ ఎంతకాలం ఉపయోగించాలి అనే ప్రశ్న వచ్చినప్పుడు మాత్రం.. మొబైల్లో ఉండే బ్యాటరీ, సాఫ్ట్వేర్ అప్డేట్ ఇతర వాటి కొన్ని విషయాలను పరిగణంలోకి తీసుకోవాలని ఉంటుందట.. సాధారణంగా అందరు మొబైల్స్ కొనేటప్పుడు అందులో ఉండే ఫీచర్స్ ను మాత్రమే ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు. అలాగే మొబైల్స్ కూడా తక్కువ ధరకు వచ్చే మోడల్స్ ని కొనుగోలు చేయడం జరుగుతూ ఉంటుంది.వీటితోపాటు అది తయారైన సంవత్సరం సాఫ్ట్వేర్ అప్డేట్ ఎంత కాలం ఉంటుంది అనే విషయాలను మనం గమనిస్తూ ఉండాలి.


మొబైల్ కొనేముందు దాని మ్యానుఫ్యాక్చరింగ్ డేటును కూడా గుర్తించాలి. వీలైనంతవరకు ప్రస్తుత ఏడాదిలో తయారుచేసిన వాటిని తీసుకోవడమే మంచిది అలాగే సాఫ్ట్వేర్ అప్డేట్లు ఎన్నేళ్లు పాటు వస్తాయో చూసుకోవాలి. సాధారణంగా చాలా బ్రాండ్స్ రెండేళ్ల పాటు సాఫ్ట్వేర్ సైతం అప్డేట్ను అందిస్తూ ఉంటాయి.. సాంసంగ్, మోటరోలా వంటి బ్రాండ్స్ కాస్త ఎక్కువ రోజులు అప్డేట్ను అందిస్తూ ఉంటాయట. ఇకపోతే మొబైల్ లో గమనించాల్సింది మరొక విషయం బ్యాటరీ. బ్యాటరీ ఎక్స్పైర్ డేట్ తర్వాత కచ్చితంగా క్షీణించే అవకాశం ఉంటుంది. అందుచేతనే బ్యాటరీ విషయంలో పలు జాగ్రత్తలు తీసుకోవాలి. మొత్తంగా ప్రస్తుతం ఉన్న రోజుల్లో మొబైల్ బ్యాటరీ ప్రాసెసర్ల పనితీరును బట్టి నాలుగేళ్ల పాటు ఒక్కో మొబైల్ ని ఉపయోగించుకోవచ్చని నిపుణులు తెలియజేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: