బుల్లి పిట్ట: నకిలీ వెబ్సైట్లను ఇలా గుర్తించండి..!!

Divya
మనం ప్రతిరోజు ఎన్నో వెబ్సైట్లను సైతం చూస్తూ ఉంటాము. అందులో కొన్ని ఫేక్ వెబ్సైట్స్ కూడా ఉండే అవకాశం చాలా ఎక్కువగానే ఉంటుంది. ఎందుకంటే ఈ మధ్యకాలంలో చాలామంది ఫ్రాడ్ చేస్తూనే ఉన్నారు. అయితే మనం ఏదైనా వెబ్సైట్ నకిలీదా ఒరిజినల్దా అని తెలుసుకోవాలి అంటే కొన్ని సూచనలు పాటించడం మంచిదంటూ టెక్నిపుణులు తెలియజేస్తున్నారు.వాటి గురించి ఇప్పుడు చూద్దాం.

మనం ఎటువంటి సమాచారాన్ని అయినా సరే క్షణాలలో వెబ్సైట్ ద్వారా తెలుసుకోవచ్చు. దీంతో చాలా వెబ్సైట్లు కనిపిస్తూ ఉంటాయి. ఈ క్రమంలోనే కొన్ని నకిలీ వెబ్సైట్లు కూడా యూజర్లకు చాలా తలనొప్పిగా మారుతున్నది. మనం ఏదైనా వెబ్సైట్ ను ఓకే చేసేందుకు ఉపయోగపడేటువంటి అడ్రస్ డొమైనో నేమ్.. ఇవి ఎక్కువగా .com,.org,.gov, .Edu లాంటి వాటిని కలిగి ఉంటాయని చెప్పవచ్చు ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే ఫేక్ డొమైన్ పేర్లు కూడా కాస్త తప్పుగా ఉంటాయట. మరికొన్ని వెబ్సైట్లు మాత్రం URL లో మొదట ఖచ్చితంగా HTTPS అని ఉండాలి ఇది సురక్షితమైన వెబ్సైట్ అని అర్థం చేసుకోవచ్చు. కొన్ని వెబ్సైట్లో మాత్రం ఓపెన్ చేయగానే అవి మరో వెబ్సైట్ కి రీడ్ అవుట్ అవుతూ ఉంటాయి ఇలాంటి వాటి పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలి.

చాలా ఒరిజినల్ వెబ్సైట్లో ABOUT US, CONTACT పేజీల సైతం ఉంటాయి ఫేక్ వెబ్సైట్లో ఇలాంటి వివరాలు అసలు ఉండవు అందువల్ల ఒక వెబ్సైట్ సరైనదా కాదా అని తెలుసుకోవడానికి ముందుగా ఇలాంటి వాటి పైన క్లిక్ చేయవలసి ఉంటుంది. ఇలాంటి వాటిలోకి వెళ్లి వెబ్సైట్ పూర్తి వివరాలను చూడాలి ఒకవేళ ఈ వివరాలు లేకపోతే అది కూడా ఫేక్ వెబ్సైట్ గానీ గుర్తుంచుకోవాలి..WEB OF TRUST అనే వెబ్సైట్ ద్వారా కూడా ఫేక్ వెబ్సైట్లను సైతం గుర్తించవచ్చట. దీనిని గూగుల్ క్రోమ్ బ్రౌజర్కు యాడ్ చేసుకోవడం మంచిది. ఒరిజినల్ వెబ్సైట్ నందు గ్రీన్ టెక్ కనిపిస్తుంది ఫేక్ వెబ్సైట్ నందు రెడ్ మార్క్ కనిపిస్తుందట.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: