బుల్లి పిట్ట: వివో నుంచి మార్కెట్లోకి సరికొత్త స్మార్ట్ ఫోన్.. ఫీచర్స్ అదర్స్..!

Divya
ప్రముఖ చైనా ఫోన్ కంపెనీ వివో తాజాగా సరికొత్త ఫీచర్స్ తో ఇండియన్ మార్కెట్లోకి కొత్త ఫోన్ లాంచ్ చేసింది. వివో Y100i పేరుతో గురువారం చైనాలో లాంచ్ చేయడం జరిగింది . వివో లేటెస్ట్ వై సిరీస్ స్మార్ట్ ఫోన్ ఫీచర్స్ చూస్తే మాత్రం నిజంగా ఆశ్చర్య పోవాల్సిందే. 6.64 అంగుళాల డిస్ప్లేను కలిగి ఉండే ఈ స్మార్ట్ ఫోన్ 60 Hz రిఫ్రెష్ రేటు తో లభిస్తుంది. ఆండ్రాయిడ్ 13 ఆధారిత ఆర్జిన్ ఓఎస్ 3 పై రన్ అయ్యే ఈ స్మార్ట్ ఫోన్ 91.6 స్క్రీన్ టు బాడీ రేషన్ కలిగి ఉంటుంది. అంతేకాదు 6.64 అంగుళాల ఫుల్ హెచ్డి ప్లస్ స్క్రీన్ ను కలిగి ఉండే ఈ స్మార్ట్ ఫోన్ డిస్ప్లే కేంద్రంగా ఉన్న హోల్ పంచ్ కటౌట్ ని కూడా కలిగి ఉంటుంది.

 అంతేకాదు వర్చువల్ ర్యామ్ ఫీచర్ ని ఉపయోగించి ఆన్ బోర్డ్ మెమోరీని 24 జీబీ వరకు విస్తరించుకోవచ్చు. అంతేకాదు ఈ హ్యాండ్ సెట్ 512 GB యు ఎఫ్ ఎస్ 2.2 స్టోరేజ్ వరకు కూడా వస్తుంది ఇక కెమెరా విషయానికే వస్తే f/2.0 ఎఫర్చర్ లెన్స్ తో ఏటి మెగాపిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరాను అమర్చారు. అంతేకాకుండా వైఫై, బ్లూటూత్ 5.1 , 3.5 ఎం ఎం ఆడియో జాక్ తో పాటు యూఎస్బీ టైప్ సి పోర్టు, జిపిఎస్ ,ఏ జిపిఎస్ అంటే కనెక్టివిటీ ఆప్షన్లు కూడా అందుబాటులో ఉన్నాయి.
ఇక చార్జింగ్ విషయానికి వస్తే 44 W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టుతో 5000 ఎమ్ఏహెచ్ బ్యాటరీని కలిగి ఉంటుంది ఇక ఇన్ని అద్భుతమైన ఫీచర్లు కలిగిన ఈ స్మార్ట్ఫోన్ మీకు 190 గ్రాముల బరువు ఉంటుంది. ఇక ధర విషయానికి వస్తే 12GB ర్యామ్+512GB స్టోరేజ్ వేరియంట్ కలిగిన ఈ స్మార్ట్ ఫోన్ సుమారుగా రూ.15000 వరకు ఉంటుంది ప్రస్తుతం పింక్ , స్కై బ్లూ,  బ్లాక్ కలర్ ఆప్షన్లలో అందుబాటులోకి వచ్చింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: