బుల్లి పిట్ట: ల్యాప్ ట్యాప్ బ్యాటరీ సేఫ్ గా ఉండాలంటే ఇలా చేయండి..!!

Divya
కోవిడ్ మహమ్మారి తర్వాత ఎక్కువగా చాలామంది వర్క్ ఫ్రం హోమ్ వాటిలోని పనిచేస్తూ ఉన్నారు. దీంతో ల్యాప్ ట్యాప్ వినియోగం ఎక్కువగా ఉన్నది.ల్యాప్ ట్యాప్ ఉంటే ఎక్కడైనా సులభంగా పనిచేసుకోవచ్చు కాబట్టి ఎక్కువగా వీటిని ఉపయోగిస్తూ ఉన్నారు. దీంతో ల్యాప్ ట్యాప్ ఎక్కువ బ్యాటరీ ఉండడం చాలా అవసరము.. మనం ఎక్కువ కాలం నుంచి ల్యాప్ ట్యాప్ వినియోగిస్తూ ఉంటాము దాని బ్యాటరీ త్వరగా తగ్గిపోతూ ఉంటే చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. అయితే కొన్ని టిప్స్ పాటించడం వల్ల మీ ల్యాప్ ట్యాప్ బ్యాటరీ చాలా కాలం వరకు కొనసాగుతుంది.

ల్యాప్ ట్యాప్  సెట్టింగులో స్వల్ప మార్పులు చేయడం వల్ల లాప్టాప్ ఉపయోగించే విధానాన్ని మార్చడం వల్ల కూడా బ్యాటరీ సామర్థ్యాన్ని సైతం మెరుగు  పరుచుకోవచ్చు..అందుచేతనే ల్యాప్ ట్యాప్ బ్యాటరీని త్వరగా డ్రై అవ్వకుండా ఉంచేలా చూసుకోవాలి.. ల్యాప్ ట్యాప్ బ్యాటరీని ఎక్కువగా చార్జింగ్కి కనెక్ట్ చేసి అలాగే వదిలేయకూడదు.. దాని నిరోధించడానికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి. ల్యాప్ ట్యాప్ లో ఉండే పవర్ సెట్టింగ్ ఆప్షన్ ని సైతం ఎంచుకోవడం చాలా మంచిది. అలాగే ల్యాప్ ట్యాప్  బ్యాటరీ లైఫ్ ని ఎక్కువకాలం ఉంచేందుకు బ్యాటరీ సెట్టింగ్ ఆప్షన్ కూడా మార్చాలి.

ల్యాప్ ట్యాప్ లో బ్యాటరీని సేవ్ చేయాలంటే అందులో బ్యాక్ గ్రౌండ్ లో రన్ అవుతున్న అన్ని యాప్స్ లను సైతం క్లోజ్ చేయవలసి ఉంటుంది. దీనివల్ల బ్యాటరీ ఎక్కువగా అయిపోతుంటుంది. దీనివల్ల బ్యాటరీ  త్వరగా డిశ్చార్జ్ అవ్వదు. అప్పుడప్పుడు బ్యాటరీ హెల్త్ లను సరిగ్గా చూసుకోవాలి. బ్యాటరీ ని అప్పుడప్పుడు పరిశీలించకపోతే చాలా ఇబ్బందులు ఏర్పడతాయి. దీంతో పదే పదే చార్జింగ్ చేయాల్సి ఉంటుంది. దీంతో ఏకంగా మదర్ బోర్డు కూడా దెబ్బతినే అవకాశం ఉంటుంది. అందుచేతనే బ్యాటరీ దెబ్బతినకుండా చూసుకోవడమే చాలా ఉత్తమం.ల్యాప్ ట్యాప్  వినియోగించేటప్పుడు ఇలాంటివి వాడడం వల్ల బ్యాటరీ లైఫ్ ఎక్కువ కాలం వస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: