అంతరిక్షం గుట్టు విప్పిన ఆ నక్షత్ర రహస్యం?

అంతరిక్షంలో కలిగే మార్పులు ఎప్పుడూ ఆశ్చర్యాన్ని కలిగిస్తూనే ఉంటాయి. నక్షత్రం ఉద్భవించినా.. అదృశ్యమైనా వింతే. వీటిని పరిశోధించడానికి శాస్త్రవేత్తలు చేసే కృషి వారు చెప్పే విషయాలు మరింత ఆసక్తిని కలిగిస్తూ ఉంటాయి. అది 2009. అనంతాకాశంలో ఒక తార ఉన్నట్టుండి మాయమైంది. అది శాస్త్రవేత్తలను ఎంతగానో ఆశ్చర్యపరిచింది. నక్షత్రాలు మరణించడం వింతేమీ కాదు. అరుదు అంతకన్నా కాదు. కానీ అందుకు ఒక క్రమం ఉంటుంది. తమ జీవిత కాలంలో చివరి ఏడాదిలో అవి అత్యంత ప్రకాశ వంతంగా మారతాయి. అనంతరం సూపర్ నోవాగా పిలిచే బ్రహ్మాండ మైన పేలుడుకు లోనవుతాయి. అలా శక్తి నంతా కోల్పోయి మరు గుజ్జు తారలుగా మిగిలిపోతాయి. నెమ్మదిగా అంతరార్థం చెందుతాయి.

కానీ సూర్యుని కంటే ఏకంగా 25 రెట్లు పెద్దదైన ఎన్6946-బీహెచ్ 1 అనే నక్షత్రం మాత్రం ఏదో మంత్రం వేసినట్లు మాయమైంది. మనకు 2.2 కోట్ల కాంతి సంవత్సరాల దూరంలో ఉన్న అది కూడా తొలుత మరణానికి సిద్ధమయ్యే ఇతర తారల మాదిరిగానే 10 లక్షల సూర్యులకు సమాన తేజంతో వెలిగిపోయింది. దీన్ని గమనించిన శాస్త్రవేత్తలు, మరో సూపర్ నోవా, చోటు చేసుకోనుందని అనుకున్నారు. కానీ జరగకపోగా,  అది వెలుగులన్నీ కోల్పోయింది. అలాగే క్రమంగా మాయమై ఆశ్చర్యాన్ని గురి చేసింది. దీనికి కారణాలపై ఇప్పుడు చర్చ జరుగుతుంది.

ఈ తార విచిత్ర అంతర్థానాన్ని జరగని సూపర్ నోవాగా అప్పట్లో కొందరు శాస్త్రవేత్తలు పిలిచారు. దాన్ని ఏదో కృష్ణబిలం మింగింది అని ప్రతిపాదించారు. ఆ ఉద్దేశంతో దాని చివర బీహెచ్1 అని చేర్చారు. అయితే అది సరికాదని కొందరు శాస్త్రవేత్తలు వాదిస్తున్నారు. దీనికి సంబంధించి జేమ్స్ వెట్ టెలిస్కోప్ ఇటీవల సేకరించిన పరిణామాల్ని విశ్లేషించిన మీదట ఆ  వాదనకు బలం చేకూరుతుంది. బీహెచ్1 తార ఉన్న చోట అతి ప్రకాశవంతమైన పరారుణ కాంతిని జేమ్స్ వెట్ గమనించింది. బహుశా పలు నక్షత్రాలు పరస్పరం కలిసిపోయి పెను తారగా మారాయనేందుకు ఇది నిదర్శనమని అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: