ఏం టాలెంట్ గురు.. మారుతి కారును రోల్స్ రాయిస్ గా మార్చాడు?

praveen
బీఎండబ్ల్యూ రోల్స్ రాయల్స్ లాంటి ఖరీదైన కార్లలో తిరగాలని ప్రతి ఒక్కరికి ఉంటుంది. కానీ ఇలా తిరగాలనే కల నెరవేర్చుకునేది మాత్రం కేవలం సంపన్నులు మాత్రమే. ఎందుకంటే సామాన్యులకు కారు కొనడమే మహా గొప్ప. అలాంటిది ఖరీదైన బీఎండబ్ల్యూ రోల్స్ రాయిస్ లాంటి కారు కొనుగోలు చేయడం అంటే అది కేవలం కలలో మాత్రమే సాధ్యమవుతుంది అని చెప్పాలి. అందుకే అలాంటి పిచ్చి ఆలోచనలు చేసి మనసు పాడు చేసుకోవడం కంటే ఇక ఉన్న దాంట్లో ఏదో ఒక చిన్న కారు కొనుగోలు చేసి సంతృప్తి పడడం మేలు అని ప్రతి ఒక్క సామాన్యుడు కూడా అనుకుంటూ ఉంటాడు.

కానీ ఇక్కడ ఒక యువకుడు మాత్రం అలా అనుకోలేదు. అతను అతి తక్కువ ధరతోనే ఒక కార్ ను కొనుగోలు చేశాడు. అయితే రోల్స్ రాయిస్ కొనుగోలు చేయాలనే కలను ఆ కారుతోనే తీర్చుకున్నాడు. ఏకంగా తన కారుని అతి తక్కువ ఖర్చుతో రోల్స్ రాయిస్ తరహా కారును తరహాలో తయారు చేసుకున్నాడు. ఇది కాస్త ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారిపోయింది. మనిషి అనుకుంటే కానిది ఏమున్నది అన్న విషయాన్ని ఈ యువకుడు నిరూపించాడు. కేరళకు చెందిన 18 ఏళ్ల హదీప్ అనే యువకుడు తన నైపుణ్యాలతో రోల్స్ రాయిస్ తరహా ఒక కారును రూపొందించాడు.

 సాధారణ కార్ నే లక్సరీ కార్లుగా మార్చాలి అనే ఆసక్తి అతనిలో ఎక్కువగా ఉండేది. ఈ క్రమంలోనే ఈ ఆలోచనని ఆచరణలో పెట్టాడు. చివరికి సాధించాడు. మారుతి 800 కారును ఏకంగా లగ్జరీ కారుగా మార్చేశాడు. ఇందుకు సంబంధించిన ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది. అయితే ఇలా మారుతీ కారును లగ్జరీ కారుగా మార్చేందుకు  అతను ఈ తీవ్రంగా శ్రమించాడు అని చెప్పాలి. కాగా కొత్తగా ఆవిష్కరించిన ఈ కారుకు ఉన్న అద్దాలు చక్రాలు హెడ్లైట్స్ సహా అన్ని భాగాలను అందంగా మలిచాడు. అంతేకాదు ఈ కారు పై ఉన్న లోగోను కూడా అతని రూపొందించడం గమనార్హం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: