స్పేస్‌ టెక్నాలజీలో ఇండియా నెం. 1 అయినట్టేనా?

డబ్బులు ఊరికే రావు అన్న మాట ఇండియాకు సరిగ్గా సరిపోతుంది. ఎందుకంటే కరోనా సమయంలో వ్యాక్సిన్ ను అత్యంత ఈజీగా తక్కువ ధరకు ఉత్పత్తి చేసి ఎన్నో దేశాలకు సరఫరా చేసేసింది. బ్రిటన్, చైనా, అమెరికా కంటే తక్కువ ధరతో ఎక్కువ క్వాలీటీతో చేసిన ఈ వ్యాక్సిన్ కు ఎంతో పేరు వచ్చింది. చాలా దేశాలకు డబ్బులిచ్చి కొనుగోలు చేశాయి. ప్రస్తుతం అలాంటిదే చంద్రయాన్ 3 ప్రయోగం. వివిధ దేశాలు మార్స్, మూన్ మీదకి వెళ్లడానికి అనేక ప్రయోగాలు చేశాయి.

అవి చాలా డబ్బులతో కూడుకుని ఉన్నవి. అయితే ఈ విషయంలో ఎంతో నేర్పుతో ఓర్పుతో అతి తక్కువ ఖర్చుతో చంద్రమండలంలోని దక్షిణ ద్రువం వైపు ల్యాండర్ ను ఇస్రో ల్యాండ్ చేయగలిగింది. అయితే చంద్రయాన్ 3 కి  అయిన ఖర్చు 77.8 మిలియన్ డాలర్లు పట్టింది. రష్యా లూన 25 కి 200 మిలియన్ డాలర్లు, చైనాకు సంబంధించి 300 డాలర్లు ఖర్చు పెట్టింది. అమెరికాకు సంబంధించి అపోలో మిషన్ కు వేల కోట్లు ఖర్చు పెట్టింది.

మార్స్ మిషన్ కు సంబంధించి మంగళ్ యాన్ కు భారత్ 74 మిలియన్ డాలర్లు ఖర్చు పెట్టింది. రష్యా పొగోస్ గ్రాంట్ 117 మిలియన్ డాలర్లు ఖర్చు పెట్టింది. అయినా అది ఫెయిల్ అయింది. జపాన్ ఖర్చు పెట్టిన మొత్తం 189 మిలియన్ డాలర్లు పెట్టిన విజయవంతంగా మార్స్ కక్షలోకి ప్రవేశపెట్టలేకపోయారు. యూరోపియన్ కు సంబంధించిన ప్రయోగం విజయం సాధించిన ఎక్స్ ప్రెస్ ఆర్బిటర్ కు 386 మిలియన్ డాలర్లు ప్రవేశపెట్టింది.

అయితే అమెరికా కూడా మార్స్ యాత్రకు ఎన్నో వేల కోట్లు ప్రవేశపెట్టింది. అయితే భారత్ మాత్రం అతి తక్కువ ఖర్చుతో అత్యంత నాణ్యతతో కూడా శాటి లైట్ ప్రయోగాలు చేస్తూ అందరికీ ఆదర్శంగా నిలుస్తుంది. రాబోయే రోజుల్లో అన్ని దేశాలకు ఇండియా మార్గదర్శకత్వం వహించిన ఆశ్చర్యపోనక్కర్లేదు .

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: