పెట్రోల్ కారులో డీజిల్ పోస్తే.. అసలేమవుతుందో తెలుసా?
అయితే ఇలా పెట్రోల్ కారులో డీజిల్ నింపడం వల్ల తీవ్ర నష్టం వాటిల్లుతుంది అని నిపుణులు చెబుతున్నారు. ఏకంగా కారు యొక్క ఇంజన్ సీజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అంతేకాదు ఇది పెట్రోల్ ఇంజన్ సిలిండర్, పిస్టెన్, షాప్ట్ దెబ్బతినేలా చేస్తుంది. ఒకవేళ పొరపాటున పెట్రోల్ కారులో డీజిల్ పోసినట్లయితే.. వేగంగా ఈ విషయాన్ని గమనించడం ఎంతో ముఖ్యం. ఎందుకంటే పెట్రోల్ కారులో డీజిల్ తో నడిపితే భారీ నష్టం వాటిల్లే అవకాశం ఉంది. అయితే ఒకవేళ పెట్రోల్ కారులో డీజిల్ పోసి నడిపితే కార్ ఆగిపోతుంది. అయితే ఇలా జరిగితే వెంటనే సర్వీస్ సెంటర్ ద్వారా కారును చెక్ చేసుకోవాలి. పెట్రోల్ ఇంజన్ డీజిల్ పై ఎక్కువ సేపు నడిపిస్తే లేదా మల్లి స్టార్ట్ చేయడానికి ప్రయత్నిస్తే ఇంజన్లో లోపం ఏర్పడుతుంది. దీంతో ఇంజన్ మొత్తం పాడవుతుంది అని చెప్పాలి. ఇక ఈ విషయంలో జాగ్రత్తలు పాటించాలని సూచిస్తున్నారు నిపుణులు.
అందుకే కారు లో పెట్రోల్ పోయాలా డీజిల్ పోయాలా లేదా అనే విషయంపై కార్ల కంపెనీలు ఇక డీజిల్ పోసే దగ్గర ముందే రాసి ఉంటాయి. ఇక పెట్రోల్ బంక్ కు వెళ్లిన ప్రతిసారి కూడా బంకులో పనిచేస్తున్న సిబ్బంది ఇక అక్కడ రాసి ఉన్న దానినిబట్టే అందులో ఏ ఇంధనాన్ని నింపాలి అన్న విషయాన్ని నిర్ణయించుకుంటూ ఉంటారు అని చెప్పాలి. అయితే ఇక మనం కారుని నడిపేటప్పుడు జాగ్రత్తలు తీసుకున్న ఇతరులకు కారుని ఇచ్చినప్పుడు ఈ జాగ్రత్త గురించి చెప్పకపోతే మాత్రం చివరికి కారు కోసం భారీగా డబ్బు ఖర్చు చేసుకోవాల్సిన పరిస్థితి వస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.