బుల్లి పిట్ట: చౌక ధరకే జియో ల్యాప్ ట్యాప్..!!

Divya
ప్రముఖ బ్రాండెడ్ మొబైల్స్, ల్యాప్ ట్యాప్ , రీఛార్జ్ ప్లాన్స్ అతి తక్కువ ధరకే లభించే వాటిలో రిలయన్స్ బ్రాండెడ్ కూడా ఒకటి. ముఖ్యంగా చౌకైన ల్యాప్ ట్యాప్స్ కస్టమర్ల కోసం అందిస్తూ ఎప్పుడూ కూడా వార్తలలో నిలుస్తూనే ఉంటుంది..JIOBOOK -11 పేరుతో అతి తక్కువ ధరకే
ల్యాప్ ట్యాప్ ఇండియాలో విడుదల చేయడం జరిగింది.
ఈ ల్యాప్ ట్యాప్ రిలయన్స్ డిజిటల్ నుండి అందుబాటులో కల్పించింది. ఈ స్మార్ట్ ల్యాప్ ట్యాప్ jio OS పైన పనిచేస్తుంది..4g volte సపోర్టుతో హెచ్డి డిస్ప్లే ఆకట్టుకొని ఫీచర్స్ తో ల్యాప్ ట్యాప్ కలదు.


Jiobook -11:
రిలయన్స్ నుంచి వచ్చిన ఈ ల్యాప్ ట్యాప్రూ.16,499 ధరలతో లాంచ్ చేయడం జరిగింది.ల్యాప్ ట్యాప్ పైన EMI ఆఫర్ కూడా వర్తిస్తుంది. ఈరోజు నుంచి ఈ ల్యాప్ ట్యాప్ రిలయన్స్ డిజిటల్ ఆన్లైన్ మరియు ఆఫ్లైన్లో అందుబాటులో ఉన్నది.ల్యాప్ ట్యాప్ ప్రత్యేక విషయాలకు వస్తే..


రిలయన్స్ యొక్క ల్యాప్ ట్యాప్11.6 అంగుళాల ఫుల్ హెచ్డి డిస్ప్లే నా కలిగి ఉంటుందట.అలాగే దీని బరువు 900 గ్రాములు ఉన్నట్లు తెలుస్తోంది. చాలా స్టైలిష్ గా డిజైన్ చేసినట్లుగా సమాచారం. జియో బుక్ -11 ఆక్టా కోర్ ప్రాసెస్ తో పనిచేస్తుంది. ఈ ల్యాప్ ట్యాప్ 4GB LPDDR4 RAM+64 GB MMC  ఇంటర్నల్ స్టోరేజ్ తో లభిస్తుంది అలాగే దీనిని 256 GB వరకు పెంచుకోవచ్చు.


JIO ల్యాప్ ట్యాప్ 4G LTE డ్యూయల్ బ్రాండ్ వైఫై సపోర్టుతో ఇంటర్నెట్ తో పనిచేస్తుంది. రిలయన్స్ OS పైన ల్యాప్ ట్యాప్ పనిచేస్తుంది మల్టీ విండోస్ సపోర్ట్ తో కూడా పనిచేస్తున్నట్లు సమాచారం. ఇందులో ట్రాక్ పాడ్ కూడా కలిగి ఉంటుంది.. ఇన్ఫినిటీ కీబోర్డుతో పాటు..2MP HD వెబ్ క్యాంప్ వైర్లెస్ ప్రింటింగ్ స్పీకర్స్ 8 గంటల బ్యాటరీ బ్యాకప్ తో ల్యాప్ ట్యాప్ పనిచేస్తోంది. ఎవరైనా చౌక ధరకే ల్యాప్ ట్యాప్ కావాలి అంటే ఇది బేశుగ్గా సరిపోతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: