బుల్లి పిట్ట:24 GB ర్యామ్ తో భారీ మొబైల్ లాంచ్..!!

Divya
ప్రస్తుతం టెక్నాలజీ పూర్తిగా మారిపోతున్న తరుణంలో ఎప్పటికప్పుడు సరికొత్త అప్డేట్స్ అయితే వస్తూనే ఉన్నాయి.. ముఖ్యంగా ఆండ్రాయిడ్ రాకముందు వరకు 512 MB రామ్ గురించి మాత్రమే మనకు తెలుసు. అయితే ఆండ్రాయిడ్ మొబైల్స్ రంగ ప్రవేశం తర్వాత ఏకంగా 1GB,2GB రామ్ సైజు ఉన్న స్మార్ట్ మొబైల్స్ ఎక్కువగా లాంచ్ అయ్యాయి. ఆ తర్వాత పెరుగుతూ 16 GB రామ్ వరకు కూడా కలిగిన మొబైల్స్ అందుబాటులోకి ఉంటున్నాయి. ఇటీవల గేమింగ్ ప్రియుల కోసం మొబైల్స్ ఎక్కువగా వినియోగిస్తూ ఉండడంతో మొబైల్ కంపెనీ సమస్యలు అధికంగా ర్యామ్ కలిగి ఉన్న మొబైల్స్ లను విడుదల చేస్తూ ఉన్నారు.
ముఖ్యంగా పబ్జి వంటి గేములు ఆడడం కోసం 1 జీబీ నుంచి 2GB వరకు ర్యామ్ సైజ్ తీసుకుంటోంది.. ఈ నేపథ్యంలోనే అధిక ర్యామ్ సైజు కలిగి ఉన్న మొబైల్ లకు మార్కెట్లో మంచి డిమాండ్ ఏర్పడుతొంది.ఇప్పటివరకు 12 GB ram నుండి 18 GB ర్యామ్ కలిగిన మొబైల్స్ అందుబాటులోకి ఉన్నాయి. అయితే ఇప్పుడు ఏకంగా ఒక స్మార్ట్ మొబైల్ 24GB ram కలిగివున్న స్మార్ట్ మొబైల్ లను లంచ్ చేయడానికి సిద్ధమయ్యింది. ఈ కంపెనీ సుబియా కంపెనీ నుంచి  సరికొత్త స్మార్ట్ మొబైల్ ని విడుదల చేసింది.
సుబియా రెడ్ మ్యూజిక్-8S  ప్రో పేరుతో ప్రపంచంలోనే మొదటిసారిగా 24 GB ram కలిగి ఉన్న మొబైల్ లను విడుదల చేయడం జరిగింది. జులై 5వ తేదీన చైనాలో ఈ మొబైల్ విడుదల కాబోతోంది. అయితే ఈ మొబైల్ ఒక్కటే మొబైల్ లోనే 24జిబి ర్యామ్ ఉంటున్నట్లు కంపెనీ తెలియజేయడం జరిగింది. ఈ మొబైల్ స్పెసిఫికేషన్ విషయానికి వస్తే..3.36GHZ గరిష్ట క్లాక్ స్పీడుతో పాటు డ్రాగన్ 8 జనరేషన్ వర్షన్ తో కలిగి ఉంటుంది.6.8 అంగుళాల ఫుల్ హెచ్డి డిస్ప్లే కలిగి ఉంటుంది. బ్యాటరీ విషయానికి వస్తే 6000 MAH సామర్థ్యం తో పాటు 80W ఫాస్ట్ ఛార్జింగ్ కెపాసిటీ కలదు. కెమెరా విషయానికి వస్తే బ్యాక్ సైడ్ 50 mp, సెల్ఫీ ప్రియుల 16 mp మెగా పిక్సెల్ కలదు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: