బుల్లి పిట్ట: రూ.199 లకే గెలాక్సీ ..A-23..!!

Divya
ఇండియాలో స్మార్ట్ ఫోన్స్ కు విపరీతమైన క్రేజ్ ఉన్నది. ఆఫ్లైన్ తో పాటు ఆన్లైన్లో కూడా ఎక్కువగా మొబైల్స్ వినియోగిస్తున్నారు ప్రజలు. ఆఫ్ లైన్స్ మార్ట్లతో పోల్చుకుంటే ఆన్లైన్ షాపింగ్ మాల్స్ కి ఎక్కువగా మొబైల్స్ పైన భారీగా తగ్గింపు ఉన్నది.. అందుచేతనే చాలామంది ఆన్లైన్లోనే మొబైల్ కొనుగోలు చేయడానికి ఇష్టపడుతున్నారు. ముఖ్యంగా దిగ్గజ సంస్థలు అయిన అమేజాన్, ఫ్లిప్ కార్ట్ వంటి వాటిలో ప్రత్యేకంగా సేల్స్ అందిస్తున్నాయి. ఇప్పుడు తాజాగా అమెజాన్ మరొక బంపర్ ఆఫర్ ను ప్రకటించింది.

బ్లాక్ బస్టర్ వ్యాల్యూ సేల్స్ లో భాగంగా. ఈనెల 14వ తేదీ నుంచి 17వ తేదీ వరకు స్మార్ట్ ఫోన్ల పైన భారీగా డిస్కౌంట్ ప్రకటించింది. ఈ సేల్లో భాగంగా బడ్జెట్ మొబైల్స్ నుండి ప్రీమియం మొబైల్స్ వరకు భారీ పర్సంటేజ్ డిస్కౌంట్ ప్రకటించింది. ముఖ్యంగా స్మార్ట్ మొబైల్స్ లో సాంసంగ్ మొబైల్స్ ను అమెజాన్ లో ఉండే ఆఫర్స్ తో రూ.199 రూపాయలకంటే తక్కువ ధరకే స్మార్ట్ మొబైల్ ని తీసుకోవచ్చు. ప్రస్తుతం అమెజాన్లో సాంసంగ్ ఏ 23 మొబైల్ ధర రూ.17,499 రూపాయలు ఉంది.
ఈ మొబైల్ అసలు ధర రూ.23,990 ఉండగా 27% తక్కువ ధరకే ఈ ఆఫర్ కింద లభిస్తుంది. అలాగే ఇతర క్రెడిట్ కార్డు బ్యాంకుల ద్వారా కొనుగోలు చేస్తే తక్షణమే వెయ్యి రూపాయలు డిస్కౌంట్ లభిస్తుంది.. దీంతో ఈ మొబైల్ రూ.16,499 లభిస్తుంది.  అలాగే మీ దగ్గర ఏదైనా స్మార్ట్ మొబైల్ ఎక్స్చేంజ్ చేసుకుంటే.. రూ.16,300 రూపాయల వరకు ఎక్సేంజ్ ఆఫర్ లభిస్తుంది. అయితే మీ మొబైల్ వ్యాల్యూ ని బట్టి పొందవచ్చు.. మీ మొబైల్ పూర్తి స్థాయిలో ఎక్స్చేంజ్ వాల్యూ పొందగలిగితే కేవలం రూ .199 రూపాయలకే స్మార్ట్ మొబైల్ లభిస్తుంది. ఈ మొబైల్ ఎక్కువగా యువతను బాగా ఆకట్టుకుంటోంది.. 50 ఎంపీ కెమెరా సెటప్ తో..6.6 అంగుళాల ఫుల్ హెచ్డి డిస్ప్లే కలదు అలాగే 25 W ఫాస్ట్ ఛార్జింగ్..5000  MAH బ్యాటరీ దీని ప్రత్యేకత.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: