యూట్యూబ్‌ మ్యూజిక్ లవర్స్ కోసం మరో సూపర్ ఫీచర్?

యూట్యూబ్‌ మ్యూజిక్ లవర్స్ కోసం మరో సూపర్ ఫీచర్?

ప్రముఖ వీడియో షేరింగ్ ప్లాట్‌ఫామ్‌ అయిన యూట్యూబ్‌, మ్యూజిక్ లవర్స్ కోసం డెడికేటెడ్ మ్యూజిక్ యాప్ అయిన యూట్యూబ్ మ్యూజిక్ ను లాంచ్ చేసిన సంగతి తెలిసిందే.ఇక ఈ మ్యూజిక్ స్ట్రీమింగ్ యాప్‌లో యూట్యూబ్ ఎప్పటికప్పుడు కూడా సరికొత్త కొత్త ఫీచర్లను లాంచ్ చేస్తోంది. ముఖ్యంగా ప్రీమియం యూజర్ల  కోసం అయితే ఎన్నో అదిరిపోయే ఫీచర్లను పరిచయం చేస్తోంది.తాజాగా యూట్యూబ్‌ మ్యూజిక్‌లో రీసెంట్‌గా ప్లే చేసిన పాటలను డౌన్‌లోడ్ చేసుకునే ఫీచర్ ని కూడా ప్రవేశపెట్టింది. ఇప్పుడు ఆండ్రాయిడ్ ప్రీమియం యూజర్లు మ్యూజిక్ యాప్ సెట్టింగ్స్‌లో "రీసెంట్లీ ప్లేయిడ్ సాంగ్స్ (Recently Played Songs)" అనే కొత్త ఆప్షన్ ని కూడా ఈజీగా యాక్సెస్ చేయవచ్చు. ఇంకా ఈ ఆప్షన్ టోగుల్‌ను ఆన్ చేసి, రీసెంట్‌గా ప్లే చేసిన 200 పాటల దాకా ఆటోమేటిక్‌గా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.


ఇక యూట్యూబ్‌ మ్యూజిక్ ఆండ్రాయిడ్ ప్రీమియం సబ్‌స్క్రిప్షన్ ఉన్న యూజర్లు సెట్టింగ్స్‌> డౌన్‌లోడ్స్‌ & స్టోరేజ్‌లో కొత్తగా "రీసెంట్లీ ప్లేయిడ్ సాంగ్స్" టోగుల్‌ని చూడవచ్చు. "స్మార్ట్ డౌన్‌లోడ్స్‌" ఫీచర్‌కి, కొత్తగా వచ్చిన ఫీచర్‌కి ఎలాంటి లింక్ అనేది ఉండదు. కొత్తగా రిలీజ్ అయిన ఫీచర్ మాత్రం సపరేట్‌గా ఉంటుంది. దీన్ని జనవరి నెలలోనే లాంచ్ చేశామని, అయితే ఇప్పుడు మాత్రమే ఆండ్రాయిడ్‌లో విస్తృతంగా అందుబాటులోకి వస్తోందని యూట్యూబ్ కంపెనీ తెలిపింది. ఈ ఫీచర్ మ్యూజిక్ యాప్‌లో విన్న 200 రీసెంట్ సాంగ్స్ దాకా ఆటోమేటిక్‌గా డౌన్‌లోడ్ చేస్తుంది. కానీ ఈ పాటలకు లైబ్రరీ ట్యాబ్‌లో ప్రత్యేకంగా ప్లేలిస్ట్ అనేది ఉండదు. అయితే దానికి బదులుగా, హోమ్ స్క్రీన్ ఐకాన్‌ను కాసేపు నొక్కి పట్టుకొని 'డౌన్‌లోడ్స్‌' యాప్ షార్ట్‌కట్ యూజ్ చెయ్యడం ద్వారా వాటిని కనుగొనవచ్చు.ఇక ఇలా సరికొత్త ఫీచర్స్ ని ప్రవేశపెడుతూ యూ ట్యూబ్ తన యూజర్లని ఎంతగానో ఆకట్టుకుంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: