బుల్లి పిట్ట: సాంసంగ్ నుంచి సరికొత్త 5G మొబైల్..!!

Divya
ప్రముఖ సౌత్ కొరియన్ దిగ్గజ సంస్థలలో సాంసంగ్ బ్రాండ్ కలిగిన మొబైల్ సంస్థ కూడా ఒకటి. ఈ బ్రాండ్ నుంచి సాంసంగ్ గెలాక్సీ కొత్త స్మార్ట్ మొబైల్ తీసుకురాబోతోంది. అదే సాంసంగ్ గెలాక్సీ A-34 -5G మొబైల్. దీని మోడల్ నెంబర్ SM -A346M తో అమెరికా ఫెడరల్ కమ్యూనికేషన్ వెబ్సైట్లో కనిపించింది.BIS సైట్లో కనిపించిన కొద్దిసేపటికి అమెరికా రెగ్యులేటర్ వెబ్సైట్లో కనిపించింది. భారత్ సహ గ్లోబల్ మార్కెట్  సాంసంగ్ గెలాక్సీ A-34 -5G మొబైల్ త్వరలోనే ఇండియాలో విడుదల కాబోతోంది. ఈ స్మార్ట్ మొబైల్ గెలాక్సీ A-33 అప్ గ్రేడ్ వెర్షన్ కలదు.

MY SMART PRICE నివేదిక ప్రకారం..సాంసంగ్ గెలాక్సీ A-34 -5G మొబైల్  25W వైట్ ఛార్జింగ్ సపోర్ట్ తో అందిస్తుందని FCC లిస్టు చూపిస్తోంది. ఈ జాబితాకు ముందు సాంసంగ్ గెలాక్సీ A-34 మొబైల్ 5-G బ్లూటూత్  SIG డేటాబేస్ తో బెంచ్ మార్కింగ్ వెబ్సైట్ లో కనిపిస్తోంది ఇందుకు సంబంధించిన కీలకమైన స్పెసిఫికేషన్స్ కూడా తెలియజేసినట్లు తెలుస్తోంది.

సాంసంగ్ గెలాక్సీ A-34 -5G మొబైల్.. స్పెసిఫికేషన్ విషయానికి వస్తే.. ఈ మొబైల్ 6.4 అంగుళాల సూపర్ AMOLED స్క్రీన్ ను కలిగి ఉంటుంది. ఈ మొబైల్ నాలుగు కలర్ ఆప్షన్లలో లభిస్తుంది..ఇక ఇతర డిజైన్ లీకుల విషయానికి వస్తే.. సెల్ఫీ కెమెరాను ఉపయోగించేందుకు మొబైల్ డిస్ప్లే లో వాటర్ డ్రాప్ స్టైలిష్ కట్ అవుట్ ను కలిగి ఉంటుందని సమాచారం. ఇక 48 ఎంపీ మెయిన్ కెమెరా తో పాటు.. 8 ఎంపీ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా. 5 ఎంపీ మైక్రో లెన్స్ తో సహా కలదు. ఈ మొబైల్ మార్చి నెలలో విడుదల కాబోతున్నట్లు సమాచారం. ఈ మొబైల్ ద్వారా దాదాపుగా రూ.28,499 రూపాయలుగా ఉంటుందని సమాచారం. 8GB రామ్ తో పాటు 128 GB స్టోరేజ్ మెమొరీ తో కలదు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: