ఈరోజుల్లో బైక్ నడపటం సరిగ్గా రాని వారు కూడా ఉన్నారు. అలాంటి వారికి గుడ్ న్యూస్..ఇక ముంబై సిటీకి చెందిన లైగర్ మొబిలిటీ కంపెనీ 2023 ఆటో ఎక్స్‌పోలో రెండు కొత్త సెల్ఫ్ బ్యాలెన్సింగ్ ఎలక్ట్రిక్ స్కూటర్లను లాంచ్ చేయడం జరిగింది. కంపెనీ లాంచ్ చేసిన ఈ రెండు ఎలక్ట్రిక్ స్కూటర్ల డిజైన్, ఫీచర్స్ ఇంకా ఇతర వివరాలను గురించి తెలుసుకుందాం.ఇక లైగర్ మొబిలిటీ రిలీజ్ చేసిన రెండు ఎలక్ట్రిక్ స్కూటర్లు ఎక్స్ ఇంకా ఎక్స్+. ఈ రెండు ఎలక్ట్రిక్ స్కూటర్లు ఆటో బ్యాలెన్సింగ్ టెక్నాలజీతో వస్తాయి. ఇంకా ఈ టెక్నాలజీ ఉండటం వల్ల ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ స్టాండ్ వేయకుండా పోయిన తనకు తానుగా బ్యాలన్స్ చేసుకుంటూ నిలబడుతుంది. ఈ స్కూటర్ నిర్ణయించిన స్పీడ్ ని దాటిన తర్వాత ఈ ఆటోబ్యాలెన్సింగ్ ఫీచర్‌ని మాన్యువల్‌గా మనం స్విచ్ ఆఫ్ చేయవచ్చు.ఈ Liger X ఇంకా X+ ఎలక్ట్రిక్ స్కూటర్లు ఒక లెర్నర్ మోడ్‌ను కలిగి ఉన్నాయి. ఇది ఆటోబ్యాలెన్సింగ్ ఫీచర్‌తో కలిసి స్కూటర్ మాక్సిమం స్పీడ్ ని లిమిట్ లో పెట్టడానికి రైడర్ని అనుమతిస్తుంది. ఈ లేటెస్ట్ ఎలక్ట్రిక్ స్కూటర్లు OTA (ఓవర్ ది ఎయిర్) సాఫ్ట్వేర్ అప్డేట్లను కూడా కలిగి ఉన్నాయి. అందువల్ల ఈ కాలంలో సరిగ్గా రైడింగ్ రానివారు కూడా ఈ ఎలక్ట్రిక్ స్కూటర్లను చాలా సులభంగా రైడింగ్ చేయవచ్చు.
ఇక లైగర్ ఎక్స్ ఎలక్ట్రిక్ స్కూటర్లో రిమూవబుల్ లిథియం అయాన్ బ్యాటరీ ప్యాక్ అనేది ఉంటుంది. అందువల్ల మీకు అవసరమైన చోట దీనిని బయటకు తీయవచ్చు. ఈ బ్యాటరీ కంప్లీట్ గా ఛార్జ్ కావడానికి పట్టే సమయం 3 గంటలు. ఇది ఒక ఫుల్ ఛార్జ్ తో మాక్సిమం 60 కిమీ రేంజ్ అందిస్తుందని వెరిఫై చేయబడింది. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ మాక్సిమం స్పీడ్ గంటకు 65 కిమీ వరకు ఉంటుంది.ఇక లైగర్ ఎక్స్ ప్లస్ ఎలక్ట్రిక్ స్కూటర్ విషయానికి వస్తే, ఈ బైక్ లో ఫిక్స్ బ్యాటరీ లేదా నాన్-రిమూవబుల్ బ్యాటరీ ప్యాక్ అనేది ఉంటుంది. ఈ బ్యాటరీ ఒక ఫుల్ ఛార్జ్ తో మాక్సిమం 100 కిమీ రేంజ్ అందిస్తుంది. ఇది ఫుల్ ఛార్జ్ కావడానికి 4.5 గంటలు పడుతుంది. ఇంకా అంతే కాకుండా లైగర్ ఎక్స్ ప్లస్ ఎలక్ట్రిక్ స్కూటర్ TFT డ్యాష్ బోర్డు స్మార్ట్‌ఫోన్‌కి యాడ్ చేసుకోవడానికి అనుకూలంగా ఉంటుంది. దీని ద్వారా నోటిఫికేషన్ అలర్ట్ ఇంకా టర్న్-బై-టర్న్ నావిగేషన్ వంటి ఫీచర్స్ ని కూడా ఈజీగా పొందవచ్చు.