బుల్లి పిట్ట: ప్రపంచంలోనే అత్యంత వేగంగా చార్జ్ అయ్యే స్మార్ట్ మొబైల్ ఇదే..!!
ఇందులో భాగంగా తాజాగా చైనాకు చెందిన స్మార్ట్ మొబైల్ దిగ్గజ సంస్థ రియల్ మీ ఒక సరికొత్త మొబైల్ ని లాంచ్ చేయడం జరిగింది. అయితే ఈ మొబైల్ కు అత్యంత ప్రాధాన్యత చార్జింగ్ కే ఇవ్వడం జరిగింది. కేవలం 8 నిమిషాలలో 100% బ్యాటరీ ఫుల్ కావడం విశేషమని చెప్పవచ్చు. ఇప్పుడు ఈ మొబైల్ యొక్క ఫీచర్స్ గురించి ఒకసారి మనం తెలుసుకుందాం. రియల్ మీ జిటినియో -5 పేరుతో స్మార్ట్ మొబైల్ విడుదల చేయడం జరిగింది. ఈ మొబైల్ 240 W చార్జింగ్ స్పీడ్ తో సపోర్ట్ చేస్తుంది. ప్రపంచంలోనే అత్యంత వేగంగా చార్జింగ్ అయ్యే మొబైల్ గా పేరుపొందింది.
బ్యాటరీ విషయానికి 4500 MAH సామర్థ్యంతో కలదు. అంతేకాకుండా రిటర్న్ చార్జింగ్ 15W స్పీడుతో పనిచేస్తుంది. రియల్ మీ ఈ స్మార్ట్ మొబైల్ ను ఈ ఏడాది లాంచ్ చేయబోతోంది. ఇక ఈ మొబైల్ ఫ్యూచర్లకు సంబంధించి ఇంకా అధికారికంగా ఎలాంటి ప్రకటన వెలబడలేదు. కానీ ఆన్లైన్లో మాత్రం 6.7 అంగుళాల ఓఎల్ఈ డిస్ప్లేను కలదు.144 హేడ్జ్ రిఫ్రెష్ రేట్ డిస్ప్లే కలదు. ఇక కెమెరా విషయానికి వస్తే 50 mp మెగాపిక్సల్ కెమెరాతోపాటు సెల్ఫీ ప్రియుల కోసం 12 మెగా ఫిక్సల్ కెమెరా కలదు ఇక స్టోరేజ్ విషయానికి 128 GB కలదు. ధర రూ.35,000 రూపాయలు అన్నట్లుగా సమాచారం.