వాట్సాప్: వావ్.. మరో బంపర్ ఫీచర్?

ఇక ఫేమస్ ఇన్‌స్టంట్ మెసేజింగ్ యాప్ వాట్సప్ తన వినియోగదారుల కోసం సరికొత్త ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకురావడానికి రెడీ అవుతుంది. వీడియో కాల్స్ అనేవి మరింత సౌకర్యవంతంగా ఉండేందుకు పిక్చర్-ఇన్-పిక్చర్ మోడన్‌ను వాట్సాప్ తీసుకురానుంది.ఇక అదే జరిగితే వినియోగదారుడు మరొక యాప్‌ను వాడుతున్నా కానీ వీడియో కాల్‌లో మాట్లాడుకోవడానికి అవకాశం ఉంటుంది.తెలుస్తున్న సమాచారం ప్రకారం.. ప్రస్తుతం ఈ ఫీచర్ వాట్సాప్ బీటా వెర్షన్‌లో రిలీజ్ చేశారు. సెలెక్టెడ్ బీటా వినియోగదారులు ఈ న్యూ ఫీచర్‌ను బాగా ఎక్స్‌పీరియన్స్ చేయొచ్చు.అలాగే రానున్న రోజుల్లో ఈ ఫీచర్‌ను సాధారణ వినియోగదారులకు కూడా ఈ ఫీచర్ ని అందుబాటులోకి తీసుకురానుంది. అయితే ఇక్కడ ఆండ్రాయిడ్ యూజర్లు ఎవరైనా వాట్సాప్ బీటా 22.24.0.79 అప్‌డేట్ చేసుకుంటారో వారి యాప్‌లో ఈ పిక్చర్-ఇన్-పిక్చర్ వస్తుంది. వాట్సాప్ బీటా ఇన్ఫో ప్రకారం తెలిసిన విషయం ఏమిటంటే.. iOS 16.1, ఆ పై వెర్షన్లలో ఈ ఫీచర్ వర్క్ చేస్తుంది.


ఇక వాట్సాప్ వీడియో కాల్‌లో పిక్చర్-ఇన్-పిక్చర్ మోడన్‌ ద్వారా యూజర్లు పూర్తి భిన్నమైన అనుభూతిని పొందుతారాని వాట్సాప్ కంపెనీ చెబుతోంది. వాట్సాప్ అకౌంట్‌లో ఈ ఫీచర్‌ను కనుక ఎనబుల్ చేస్తే.. వీడియో కాల్ సమయంలో మరొక యాప్‌ని కూడా మీరు యూజ్ చేయొచ్చు. ఇది పిక్చర్-ఇన్-పిక్చర్ వ్యూ లో మీకు కనిపిస్తుంది. ప్రస్తుతం టెస్టింగ్ దశలో ఉన్న ఈ ఫీచర్ త్వరలోనే కంప్లీట్ స్థాయిలో యూజర్లకు అందుబాటులోకి రానుందని కంపెనీ ప్రకటించింది.ఇంకా అలాగే మరో సరికొత్త ఆప్షన్‌ను కూడా అందుబాటులోకి తీసుకువచ్చే ప్రయత్నం చేస్తోంది వాట్సప్ కంపెనీ. మెసేజ్‌ కనిపించకుండా చేసేందుకు షార్ట్‌ కట్ ఆప్షన్‌ను రెడీ చేస్తోంది. ఇంకా ఇది కూడా ఆండ్రాయిడ్ బీటా వెర్షన్ యూజర్లకు అందుబాటులో ఉంది. వాట్సాప్ బీటా ఆండ్రాయిడ్ 2.22.24.9 అప్‌డేట్‌లో మెసేజ్ డిసప్పియర్ చేసే షార్ట్ కట్ ఫీచర్‌ను రీడిజైన్ చేయడం జరుగుతోంది. ఇక ఈ ఫీచర్‌తో కొత్త ఇంకా పాత చాట్‌లను డిసప్పియర్ థ్రెడ్స్‌గా గుర్తించడం కూడా చాలా ఈజీ అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: