బుల్లి పిట్ట: మీ ల్యాప్ ట్యాప్ బ్యాటరీ సామర్థ్యం ఇలా తెలుసుకోండి..!!

Divya
కరోనా తర్వాత నుంచి ఉద్యోగుల ప్రతి ఒక్కరు కూడా ఎక్కువగా ఇంట్లోనే వర్క్ చేయడం వల్ల ల్యాప్ ట్యాప్ లో వినియోగం చాలా పెరిగిపోయిందని చెప్పవచ్చు. డెస్క్ టాప్ కంటే ల్యాప్ ట్యాప్ వంటివి ఎక్కువగా ఉపయోగిస్తూ ఉన్నారు. అంతేకాకుండా తమకు ఇష్టమైన రీతిలో కూర్చొని పని చేసుకోవచ్చని విటికె ఎక్కువ మక్కువ చెబుతున్నారు. అయితే కొత్త ల్యాప్ ట్యాప్ బ్యాటరీ లైఫ్ సమస్య ఉన్నప్పటికీ కొద్దిగా పాతపడిన తర్వాత బ్యాటరీ బ్యాకప్ ఉండకపోవచ్చు. లేదా ల్యాప్ ట్యాప్ పాతబడడం ప్రారంభించినప్పుడు బ్యాటరీ త్వరగా డ్రేయిన్ అవ్వడం ప్రారంభమవుతుంది.

ల్యాప్ ట్యాప్ విండోస్ -10 పై మీరు పని చేస్తున్నట్లయితే మీ ల్యాప్ ట్యాప్ బ్యాటరీ హెల్త్ న ఒకసారి చెక్ చేసుకోవాలి. అందుకు మీరు మీ సిస్టంలో కమాండ్ ప్రాసెస్ ను మొదలు పెట్టాలి. ఇందుకోసం విండోస్ సెర్చింగ్ లేదా స్టార్ మెనూలో cmd లేదా కమాండ్ ప్రాసెస్ ని పరిశీలిస్తే మీరు అక్కడి నుంచి ప్రారంభమై ఫైల్ పాత్ తో కూడిన విండో ను చూడవచ్చు. అక్కడ అది నలుపు రంగులో లేదా మరేదైనా రంగులు ఉండవచ్చు. ఇక ఆటో తర్వాత powercfg/batteryreport అని టైప్ చేసి ఎంటర్ చేయాలి దీని కారణంగా సేవ్ చేయబడిన బ్యాటరీ లైఫ్ రిస్టోర్ మెసేజ్ ల్యాప్ ట్యాప్ పైన కనిపిస్తుంది. అటు తరువాత మీ బ్యాటరీ రిపోర్ట్ ని చూడవచ్చు.
అటు తర్వాత యూజర్ పోర్టల్ లోకి c:users [your _user _name] బ్యాటరీ రిపోర్ట్ html అని టైప్ చేయడం ద్వారా బ్యాటరీ నివేదికను చూడవచ్చు.
ఒకవేళ మనం ఫైల్ ఎక్స్ పోర్టర్ ద్వారా కూడా ఈ ఫోల్డర్ ని చూడవచ్చు.. ఈ సిస్టం రూపొందించిన నివేదికలో బ్యాటరీ వినియోగం ద్వారా గ్రాఫిక్స్ ద్వారా చూపించబడుతుంది. వీటితోపాటు బ్యాటరీ పూర్తి ఎనర్జీ బ్యాటరీ ప్రస్తుత స్థితి కూడా అక్కడ తెలియజేస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: