బుల్లి పిట్ట: మొబైల్ డూప్లికేటా..ఒరిజినలా.. ఈ చిన్న ట్రిక్ తో తెలుసుకోండి..!!

Divya
ప్రస్తుత కాలంలో ప్రతి ఒక్కరం కూడా మొబైల్స్ అనేది పలు రకాలుగా ఉపయోగించుకుంటూ ఉన్నాము. మనం ఎక్కడికి వెళ్లాలన్నా కచ్చితంగా మొబైల్ మన దగ్గర ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. అంతలా మనం మొబైల్స్ కి అడిక్ట్ అయిపోయామని చెప్పవచ్చు. ముఖ్యంగా చిన్నపిల్లలు సైతం ఈ మధ్యకాలంలో మొబైల్స్ కి అలవాటు పడడం జరుగుతూ వస్తోంది. ప్రతి చిన్న పనికి మొబైల్ ద్వారానే అన్నిటిని పూర్తి చేస్తూ ఉండడంతో అందరూ మొబైల్ ని ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. ఇందుకు తోడు మొబైల్ తయారీ సంస్థలు కూడా నిత్యం సరికొత్త ఫీచర్లతో మొబైల్స్ ని మార్కెట్లోకి విడుదల చేస్తూ ఉన్నారు.

పలు బ్రాండెడ్ కలిగిన మొబైల్స్ తక్కువ ధరకే అద్భుతమైన ఫీచర్లను కలిగి ఉన్న ఫోన్లను మార్కెట్లోకి వదులుతూ కస్టమర్లను బాగా ఆకట్టుకుంటున్నారు. అయితే కొన్ని మొబైల్స్ పలు బ్రాండెడ్ పేరిట మోసం జరుగుతోంది అనే వార్తలు కూడా అక్కడక్కడ వినిపిస్తూ ఉంటాయి. ఇక కొంతమంది మొబైల్ లను ట్యాంపరింగ్ చేస్తున్నారని వార్తలు కూడా వినిపిస్తున్నాయి. ఒకవేళ ఒరిజినల్ మొబైల్స్ కు బదులుగా డమ్మీ మొబైల్స్ లను కస్టమర్లకు అమ్మినట్లు అయితే.. ఒరిజినల్ మొబైల్ బాడీ పార్ట్ ని తీసేసి డమ్మీ పార్ట్లు ఉన్నట్లుగా గుర్తిస్తే.. ఈ విషయం చాలా కఠినంగా ఉంటుందని టెక్ నిపుణులు తెలియజేస్తున్నారు. అయితే ఇలాంటి సమయంలో కస్టమర్లు ఏం చేయాలో అన్న విషయం ఇప్పుడు తెలుసుకుందాం.


మొబైల్ వినియోగదారులు తన మొబైల్ ఒరిజినలా డూప్లికేటా అని తెలుసుకోవాలంటే ముందుగా డిపార్ట్మెంట్ ఆఫ్ టెలి కమ్యూనికేషన్ ను సంప్రదించవలసి ఉంటుంది. ఇందులో ఒక మెసేజ్ చేయాలి మీ మొబైల్ నుంచి..KYM అని టైప్ చేసి స్పేస్ ఇవ్వాలి ఆ తర్వాత 15 అంకెలు గల EMI నెంబర్ను ఎంటర్ చేసి ఆ తర్వాత..1422 అనే నెంబర్ కి మెసేజ్ సెండ్ చేయవలసి ఉంటుంది . కొంత సమయం తర్వాత మీ మొబైల్ కు రిప్లై వస్తుంది.  ఇలా మనం ఉపయోగిస్తున్న మొబైల్ ఒరిజినలా కాదా అనే విషయాన్ని తెలుసుకోవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: