ఇన్ స్టాగ్రామ్ నుంచి కొత్త ఫీచర్?

ఇన్ స్టాగ్రామ్ తమ యూజర్ లకు మరో ఫీచర్ ను అందుబాటులోకి తీసుకురానుంది. ఇక నుంచి ఇన్‌స్టాగ్రామ్ ప్రొఫైల్‌కు సాంగ్స్ కూడా యాడ్ చేసుకునే సౌలభ్యాన్ని అందుబాటులోకి తీసుకొస్తుంది. ఈ ఫీచర్ అందరికీ అందుబాటులో లేదు. ప్రస్తుతం డెవలప్ మెంట్ దశలో ఉంది. మెటా యాజమాన్యంలోని ఇన్‌స్టాగ్రామ్ సరికొత్త ఫీచర్లతో నెటిజన్లను ఆకట్టుకుంటోంది. యూజర్లు తమ ఇన్‌స్టాగ్రామ్ ప్రొఫైల్‌కు సాంగ్స్ యాడ్ చేసుకునేందుకు వీలు కల్పించేలా ఒక ఫీచర్‌ను సిద్ధం చేస్తోంది. ఈ సౌకర్యం అందుబాటులోకి వస్తే ప్రొఫైల్ పేజీలో యూజర్స్ బయో కింద యాడ్ చేసుకున్న సాంగ్ కనిపిస్తుంది. త్వరలో రాబోయే ఈ ఫీచర్‌కు సంబంధించిన స్క్రీన్ షాట్లు కూడా సోషల్ మీడియాలో షేర్ అవుతున్నాయి. ప్రస్తుతం ఈ ఫీచర్ అభివృద్ధి దశలో ప్రోటోటైప్‌గా ఉంది. ఇంకా యూజర్లకు అందుబాటులోకి రాలేదు. ఇన్‌స్టాగ్రామ్ అధికార ప్రతినిధి ఒకరు దీనిని ధ్రువీకరిస్తూ ఇంటర్నల్ ప్రోటోటైప్‌గా ఉందని, ఇంకా బీటా టెస్టింగ్‌కు రాలేదని వివరించారు. ఇన్ స్టాగ్రామ్ లోని ప్రొఫైల్‌కు పాటలు జత చేసే సౌకర్యాన్ని ఇస్తున్న సామాజిక మాద్యమ సంస్థల్లో ఇన్‌స్టాగ్రామ్ మొదటిది అయితే మాత్రం కాదు.మైస్పేస్ సోషల్ మీడియా వంటి ప్లాట్‌ఫామ్స్ చాలా ఏళ్ల కిందే ఈ సౌలభ్యాన్ని అందుబాటులోకి తీసుకువచ్చాయి.



ఇన్ స్టాగ్రామ్ లో ప్రొఫైల్ కు పాట యాడ్ చేసుకునే ఫీచర్ ఇంకా అందుబాటులోకి రాలేదు. అయితే ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్‌కు మ్యూజిక్ యాడ్ చేసుకునే వెసులుబాటు అందుబాటులోకి వచ్చింది. ఇన్‌స్టాగ్రామ్ యూజర్లు యాప్ లైబ్రరీ నుంచి గానీ, థర్డ్ పార్టీ యాప్స్ నుంచి గానీ సాంగ్స్‌ను సెలెక్ట్ చేసుకోవచ్చు.ఇన్ స్టాగ్రామ్ యాప్ ఇప్పటికే పలు కొత్త ఫీచర్లను అందుబాటులోకి తీసుకువచ్చింది. యూజర్లు ఎవరినైనా బ్లాక్ చేసినప్పుడు వాళ్లు ఇంకో ఖాతా క్రియేట్ చేసి ఇబ్బంది పెట్టకుండా ఉండే ఫీచర్‌ను అందుబాటులోకి తెచ్చింది. బ్లాక్ చేసినప్పుడు ఆ యూజర్ ఏ ఖాతా క్రియేట్ చేసిన ఇక మిమ్మల్ని ఫాలో కాలేరు. కనెక్ట్ కాలేరు. ఎవరినైనా కావాలని ఇబ్బంది పెడుతుంటే అలాంటి వారి ఇబ్బందుల నుంచి ఈ యాప్ రక్షణ కల్పిస్తుంది. నచ్చని పదాలతో కూడిన కామెంట్స్ ఎవరైనా చేస్తే హిడెన్ వర్డ్స్ అనే ఫీచర్ ద్వారా ఆ కంటెంట్‌ను తొలగించివేస్తుంది. దాదాపు 40 శాతం కామెంట్లు నేరపూరితమైన కంటెంట్‌గా ఉంటున్నాయని భావించి ఇన్ స్టాగ్రామ్  ఈ ఫీచర్ అందుబాటులోకి తీసుకువచ్చింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: