టీవీఎస్ రైడర్ 125 న్యూ వేరియంట్ లాంచ్.. పూర్తి వివరాలు?

టీవీఎస్ కంపెనీ  టీవీఎస్ రైడర్ 125 బైక్ లాంచ్ చేసింది. ఇక ఇప్పుడు టాప్ వేరియంట్ విడుదలైంది. ఈ బైక్ ధర రూ. 99,990 (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ). బేస్ 'డ్రమ్' వేరియంట్ ధర రూ. 85,973 (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ), కాగా 'డిస్క్' వేరియంట్ ధర రూ. 93,489 (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ) వరకు ఉన్నాయి. ఈ ధరలను బట్టి చూస్తే కొత్తగా విడుదలైన టాప్ స్పెక్ వేరియంట్ ధర కొంత ఎక్కువగా ఉంది. కానీ ఫీచర్స్ పరంగా దాని మునుపటి మోడల్స్ కంటే ఉన్నతంగా ఉంటుంది.ఇది దాని మునుపటి మోడల్ కంటే కూడా ధర వద్ద అందుబాటులో ఉంది. అయితే ఇందులో 5 ఇంచెస్ TFT డిస్ప్లే పొందుతుంది.ఇందులో SmartXconnect కనెక్టివిటీ టెక్నాలజీ ఫీచర్ అందుబాటులో ఉంది. ఇది బైక్‌ను మొబైల్‌కి కనెక్ట్ చేయడానికి సపోర్ట్ చేస్తుంది. అందువల్ల దీని ద్వారా టర్న్-బై-టర్న్ నావిగేషన్, వాయిస్ కమాండ్‌లు, కాల్ అలర్ట్‌లు, మెసేజ్ నోటిఫికేషన్‌లు ఇంకా అలాగే మ్యూజిక్ కంట్రోల్ వంటి ఫీచర్లను పొందవచ్చు.ముందువైపు టెలిస్కోపిక్ సస్పెన్షన్,వెనుకవైపు 5 స్టెప్ అడ్జస్టబుల్ మోనోషాక్‌ పొందుతుంది.



 బ్రేకింగ్ విషయానికి వస్తే, ఇది ముందు భాగంలో పెద్ద 240 మిమీ సింగిల్ డిస్క్ బ్రేక్ ఇంకా వెనుక 130 మిమీ డ్రమ్ బ్రేక్‌ కలిగి ఉంది. ఈ బైక్ యొక్క ఫ్యూయెల్ కెపాసిటీ 10 లీటర్లు.టీవీఎస్ రైడర్ 125 బైక్ లో ఇంటెల్లిగో సైలెంట్ ఇంజన్ స్టార్ట్ సిస్టమ్‌ ఉంటుంది. అంతే కాకున్నా ఇది 124.8 సిసి సింగిల్-సిలిండర్, SOHC ఇంజిన్ పొందుతుంది. ఇంజిన్ 7,500 ఆర్‌పిఎమ్ వద్ద 11.4 బిహెచ్‌పి పవర్ ఇంకా 6,000 ఆర్‌పిఎమ్ వద్ద 11.2 ఎన్ఎమ్ టార్క్ అందిస్తుంది. ఇది 5 స్పీడ్ గేర్‌బాక్స్ కి జతచేయబడి ఉంటుంది. పవర్ అండ్ ఎకో అనే రెండు పవర్ మోడ్‌లు కూడా అందుబాటులో ఉన్నాయి. అదే సమయంలో ఈ బైక్ 5.9 సెకన్లలో గంటకు 60 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్తుంది.ఇందులోని TFT స్క్రీన్ ద్వారా సర్వీస్ రిమైండర్, గేర్ పొజిషన్ ఇండికేటర్, టాప్ స్పీడ్ రికార్డర్, డిస్టెన్స్ టు ఎంప్టీ వంటి డీటెయిల్స్ పొందవచ్చు. కంపెనీ ఇందులో కొత్త ఫీచర్స్ ప్రవేశపెట్టినప్పటికీ మెకానికల్స్ పరంగా  అప్డేట్స్ చేయలేదు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: