ఫేమస్ ఇండియన్ టూ వీలర్ తయారీ కంపెనీ 'హీరో మోటోకార్ప్' తన 'స్ప్లెండర్ ప్లస్' బైకును కొత్త కలర్ లో పరిచయం చేసింది.ఈ కొత్త కలర్ లో 'హీరో స్ప్లెండర్ ప్లస్' మునుపటికంటే కూడా చాలా ఆకర్షణీయంగా మారిపోయింది.ఇండియన్ మార్కెట్లో ఇప్పుడు 'హీరో స్ప్లెండర్ ప్లస్' సిల్వర్ నెక్సస్ బ్లూ కలర్ అనే కొత్త కలర్‌లో అందుబాటులో ఉంది. దీని ధర రూ. 70,658 (ఎక్స్-షోరూమ్). ఈ కొత్త కలర్ ప్రవేశపెట్టడంతో 'స్ప్లెండర్ ప్లస్' ఇప్పుడు మొత్తం 6 కలర్ ఆప్సన్స్ లో అందుబాటులో ఉంది. అవి బ్లాక్ విత్ పర్పుల్, గ్రే విత్ గ్రీన్, బ్లాక్ విత్ సిల్వర్, సిల్వర్ నెక్సస్ బ్లూ, మ్యాట్ షీల్డ్ గోల్డ్ ఇంకా అలాగే స్పోర్ట్స్ రెడ్ విత్ బ్లాక్ కలర్స్.ఇండియన్ మార్కెట్లో 100 సిసి విభాగంలో అత్యధిక అమ్మకాలు పొందుతున్న బైకుల్లో 'హీరో స్ప్లెండర్ ప్లస్' ఒకటి. అయితే ఇప్పుడు ఈ కొత్త కలర్ ఆప్సన్ లో రావడం వల్ల మరింతమంది కొనుగోలుదారులను ఆకర్శించే అవకాశం ఉంది. అమ్మకాలు కూడా పెరిగే అవకాశం ఉంది.స్ప్లెండర్ ప్లస్ మోటార్‌సైకిల్‌లో కలర్ చేంజ్ తప్పా మిగిలిన ఎటువంటి మార్పులు చేయలేదు, కావున ఇందులో అదే 97.2 సిసి, సింగిల్-సిలిండర్, ఎయిర్-కూల్డ్ ఇంజన్ అందుబాటులో ఉంది. ఇది 8,000 ఆర్‌పిఎమ్ వద్ద 7.9 బిహెచ్‌పి పవర్ ఇంకా 6,000 ఆర్‌పిఎమ్ వద్ద 8.05 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది.
ఇంజిన్ 4 స్పీడ్ గేర్‌బాక్స్‌తో అనుసంధానించబడి ఉంది.అందువల్ల ఇది మంచి పనితీరుని అందిస్తుంది.కొత్త హీరో స్ప్లెండర్ ప్లస్ అద్భుతమైన సస్పెన్షన్ ఇంకా అలాగే బ్రేకింగ్ సిస్టం పొందుతుంది. సస్పెన్షన్ విషయానికి వస్తే ఈ బైక్ ముందుభాగంలో టెలిస్కోపిక్ ఫోర్క్స్ ఇంకా వెనుక వైపు డ్యూయల్ స్ప్రింగ్ లోడ్ సస్పెన్షన్ ఉన్నాయి. బ్రేకింగ్ విషయానికి వస్తే, ఈ బైక్ ముందు ఇంకా వెనుక భాగంలో డ్రమ్ బ్రేక్స్ అందుబాటులో ఉంటాయి.ఇంకా అలాగే డిజైన్ లో కూడా ఎటువంటి మార్పులు లేదు, కావున ఈ బైక్ లో హాలోజన్ హెడ్‌లైట్, టెయిల్ లైట్ ఇంకా ఇండికేటర్ మొదలైనవి మునుపటి మోడల్ లో లాగానే ఉన్నాయి. అంతే కాకూండా కొత్త మోడళ్లలో సెమీ-డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ ఇప్పుడు అందుబాటులో ఉంది.ఇది కొత్త కలర్ లో అందుబాటులో ఉన్న కొత్త హీరో స్ప్లెండర్ ప్లస్ బేస్ వేరియంట్ ధర రూ. 70,658 (ఎక్స్-షోరూమ్) నుండి ప్రారంభమవుతుంది. అదే సమయంలో ఇందులోని టాప్ వేరియంట్ ధర రూ. 72,978 (ఎక్స్-షోరూమ్) వరకు ఉంటుంది. ఈ ధరలు దాని స్టాండర్డ్ మోడల్ కంటే కూడా కొంత ఎక్కువ ధరలో అందుబాటులో ఉంటుంది.