బెంగుళూరుకి చెందిన ఎలక్ట్రిక్ వెహికిల్ కంపెనీ ఏథర్ ఎనర్జీ, ఇటీవల తమ మూడవ తరం 450ఎక్స్ ఎలక్ట్రిక్ స్కూటర్ ను విడుదల చేసింది. ఇక ఆగస్టు నెలలో 6,410 యూనిట్ల 450ఎక్స్ ఎలక్ట్రిక్ స్కూటర్లను విక్రయించినట్లు కంపెనీ పేర్కొంది.జులై నెలలో ఏథర్ ఎనర్జీ విక్రయించిన 2,389 యూనిట్లతో పోలిస్తే, గత నెలలో మొత్తం అమ్మకాలు 297 శాతం వృద్ధిని నమోదు చేశాయి. నాలుగేళ్ల క్రితం ఓ స్టార్టప్ కంపెనీగా ప్రారంభమైన ఏథర్ ఎనర్జీ, ఇప్పుడు దేశంలోనే అత్యంత ప్రధానమైన ఎలక్ట్రిక్ స్కూటర్ తయారీ కంపెనీలలో ఒకటిగా ఎదుగుతోంది. ఏథర్ ఎనర్జీ ప్రస్తుతం మార్కెట్లో ఒకే ఒక మోడల్ 450ఎక్స్ ని మాత్రమే విక్రయిస్తోంది. ఇది రెండు వేరియంట్లలో స్టాండర్డ్ 450ఎక్స్ ఇంకా 450 ప్లస్ అనే వేరియంట్లలో లభిస్తుంది.ఏథర్ ఎనర్జీకి తమిళనాడులోని హోసూర్ లో ఓ పెద్ద ఎలక్ట్రిక్ స్కూటర్ ఫ్యాక్టరీ ఉంది. ఈ ప్లాంట్ నుండి ఇటీవలే తమ 50,000వ యూనిట్ ను కంపెనీ బయటకు విడుదల చేసింది. ఎలక్ట్రిక్ స్కూటర్ల ఉత్పత్తిని పూర్తి చేసింది. 50 నెలల్లో ఏథర్ ఈ ఘనత సాధించింది. ఏథర్ ఎనర్జీ 2018 సంవత్సరంలో తొలిసారిగా ఏథర్ 450ఎక్స్ ఇ-స్కూటర్‌ను విడుదల చేసింది.
దేశంలో ఎలక్ట్రిక్ వాహనాలకు పెరుగుతున్న డిమాండ్ దృష్ట్యా ఏథర్ ఎనర్జీ కూడా తమ ప్రోడక్ట్ పోర్ట్‌ఫోలియోని విస్తరించుకునేందుకు ప్లాన్ చేస్తోంది.ఏథర్ ఎనర్జీ కొత్తగా విడుదల చేసిన 2022 ఏథర్ 450ఎక్స్ జెన్ 3 మోడల్ దాని పాత మోడల్ కన్నా ఎక్కువ అప్‌గ్రేడ్ లను కలిగి ఉంటుంది. ఈ అప్గ్రేడ్లలో అదనపు ఫీచర్లు, పెద్ద ఇంకా మెరుగైన బ్యాటరీ మేనేజ్మెంట్, మరింత ఎక్కువ రేంజ్ అలాగే మెరుగైన పనితీరు వంటి అంశాలు చాలానే ఉన్నాయి. ప్రస్తుతం, భారత మార్కెట్లో ఏథర్ 450ఎక్స్ ధర రూ. 1.39 లక్షలు (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ) ఇంకా ఏథర్ 450 ప్లస్ ధర రూ. 1.17 లక్షలు (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ) గా ఉన్నాయి.దేశంలో మరింత ఎక్కువ మంది వినియోగదారులకు చేరువయ్యేందుకు కంపెనీ ఇటీవలే పూణే, చెన్నై ఇంకా అలాగే రాంచీలలో మూడు కొత్త అనుభవ కేంద్రాలను కూడా ప్రారంభించింది. అమ్మకాలను పెంచుకునేందుకు అలాగే తమ కస్టమర్లకు ఎలక్ట్రిక్ స్కూటర్లను కొనుగోలు చేసే ప్రక్రియను సులభతరం చేసేందుకు సరసమైన ఫైనాన్సింగ్ ఆప్షన్లను అందించడానికి ఏథర్ ఎనర్జీ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాతో కూడా ఓ డీల్ కుదుర్చుకుంది.