గూగుల్ మ్యాప్స్ : వావ్ ఇక నుంచి ఆ సూపర్ ఫీచర్ కూడా!

ఇక ఒకప్పుడు ఏదైనా అడ్రస్‌ తెలియాలంటే పక్కన వారిని అడిగి తెలుసుకునే వారు. కానీ ఏమంటూ గూగుల్‌ మ్యాప్స్‌ అనేది అందుబాటులోకి వచ్చిందో అప్పటి నుంచి కూడా సీన్‌  అనేది పూర్తిగా మారింది.ఎవరి అవసరం లేకుండా కూడా మీ చేతిలో స్మార్ట్‌ఫోన్‌ ఉంటే చాలు ఏ చిరునామానైనా మీరు చాలా సింపుల్‌గా తెలుసుకోవచ్చు. మ్యాప్స్‌ ఆన్‌ చేసుకొని ఎక్కడికైనా కూడా మీరు చాలా ఈజీగా వెళ్లిపోవచ్చు. ఇక మ్యాప్స్‌లో ఎప్పటికప్పుడు కొత్త కొత్త ఫీచర్లను తీసుకొస్తూ యూజర్లను అట్రాక్ట్‌ చేస్తోంది గూగుల్‌. ఈ క్రమంలో మనకు అందుబాటులోకి వచ్చిందే స్ట్రీట్‌ వ్యూ. ఈ ఫీచర్‌ సహాయంతో ఏ ప్రాంతాన్నయినా కూడా బాగా రియస్టిక్‌గా చూడొచ్చు. అయితే ఇప్పటి వరకు కూడా ఈ ఫీచర్‌ కేవలం విదేశాల్లో మాత్రమే అందుబాటులో ఉండేది. కానీ తాజాగా గూగుల్‌ ఈ ఫీచర్‌ను భారత్‌లో కూడా పరిచయం చేసింది.త్వరలోనే ఈ ఫీచర్‌ను హైదరాబాద్‌తో పాటు దేశంలోని మరో 8 నగరాల్లో కూడా అందుబాటులోకి తీసుకురానుంది. ఈ ఫీచర్‌ సహాయంతో ఏ ప్రాంతాన్నైనా కూడా రియలస్టిగ్‌ చూడవచ్చు. మీ లొకేషన్‌కు సమీపంలో ఉన్న ల్యాండ్ మార్క్‌లను కూడా చాలా సులభంగా గుర్తింవచ్చు.


గూగుల్‌ ఈ సేవలను భారత్‌లోని జెనెసిస్‌ ఇంటర్నేషనల్‌ ఇంకా అలాగే ప్రముఖ ఐటీ సంస్థ టెక్ మహీంద్రా సహకారంతో తీసుకొస్తోంది. గూగుల్ ఈ సేవలను తొలుత బెంగళూరులో జులై 27 వ తేదీన లాంచ్‌ చేసింది. ఇక బెంగళూరు తర్వాత ఈ ఫీచర్‌ అందుబాటులోకి వచ్చేది హైదరాబాద్‌లోనే. వీటితో పాటు భారత్‌లో కోల్‌కతా, చెన్నై, ఢిల్లీ, ముంబై, పుణె, నాసిక్, వడోదరా, అహ్మద్‌నగర్ ఇంకా అలాగే అమృత్‌సర్ నగరాల్లో ఈ ఫీచర్‌ను తీసుకొస్తున్నారు.ఈ స్ట్రీట్‌ వ్యూను ఉపయోగించుకోవడం కోసం మొదట గూగుల్ మ్యాప్స్‌ యాప్‌లోకి వెళ్లి లోకేషన్ పేరును టైప్ చేసి.. అందులో సెర్చ్ చేయాలి. ఆ తర్వాత స్క్రీన్ కింది భాగంలో స్ట్రీట్ వ్యూ ఐకాన్ అనేది మీకు కనిపిస్తుంది. ఇక దానిపై ట్యాప్ చేయాలి. అప్పుడు స్ట్రీట్ వ్యూలో ఆ ప్రాంతం మొత్తం కూడా మీకు కనిపిస్తుంది. లేకపోతే మ్యాప్‌పై కనిపించే లేయర్స్ సింబల్‌పై ట్యాప్ చేసి కూడా మీరు ఈ స్ట్రీట్ వ్యూను ఈజీగా ఎనేబుల్ చేసుకోవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: