Huawei : 5 నిముషాలు ఛార్జ్ చేస్తే 200 కి.మీ ప్రయాణం!

దేశంలో ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం బాగా పెరిగిపోతున్న సంగతి తెలిసిందే. కేంద్ర ప్రభుత్వం కూడా ఈ వాహనాల వినియోగం పైనే అడుగులు వేస్తుంది.మీరు ఎలక్ట్రిక్ కారు ఇంకా స్కూటర్‌ ఉపయోగిస్తున్నారా? వాటికి ఛార్జింగ్ పెట్టేటప్పుడు చాలా ఇబ్బంది పడుతున్నారా? గంటల సమయం ఛార్జింగ్ కోసం మీరు వెచ్చిస్తున్నారా?అయితే ఇక మీ సమస్యలకు huawei కంపెనీ ఇచ్చిన కొత్త ప్రకటన పెద్ద ఉపశమనాన్ని ఇస్తుంది. ఈ చైనీస్ కంపెనీ అలాంటి సాంకేతికతపైన పని చేస్తోంది. కంపెనీ తెస్తున్న ఈ సాంకేతికత వల్ల మీరు మీ ఎలక్ట్రిక్ వాహనాన్ని 200 కి.మీ ప్రయాణం కోసం కేవలం 5 నిమిషాల పాటు ఛార్జ్ చేస్తే చాలు సరిపోతుందని ఆ కంపెనీ చెబుతోంది.ఇక చాలా మంది కూడా ఇప్పటికీ ఎలక్ట్రిక్ వాహనాలను ప్రయాణానికి ఎంచుకోకపోవటానికి ఇష్టపడరు. ఎందుకంటే ఎలక్ట్రిక్ వాహనాలు అనేవి తక్కువ దూరం ప్రయాణించేందుకు వీలు ఉండటమే. అలాగే దీనికి తోడు ఎలక్ట్రిక్ వాహనాలు ఛార్జ్ చేయడానికి ఎక్కువ సమయం పట్టడం మరో పెద్ద కారణంగా చెప్పుకోవాలి. huawei ప్రయోగం కనుక విజయవంతమైతే.. ఈ ఛార్జింగ్ పరిష్కారం అనేది ఎలక్ట్రిక్ వాహనాల రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకురానుంది. 


ఇక కంపెనీ ఎల్లప్పుడూ కూడా తన వినియోగదారుల కోసం గొప్ప ఉత్పత్తులు ఇంకా అలాగే సేవలను అందించడానికి ప్రయత్నిస్తుందని సంస్థ సీనియర్ అధికారి వాంగ్ చావో చెప్పారు.అలాగే రాబోయే కొద్ది సంవత్సరాల్లో 1000V EV ఛార్జింగ్ సొల్యూషన్ అత్యాధునిక సాంకేతికతతో ఇది పరిచయం చేయనుంది. దీంతో ఎలక్ట్రిక్ వాహనాన్ని ఒక 5 నిమిషాల పాటు ఛార్జింగ్ చేస్తే 200 కి.మీ ప్రయాణించవచ్చని కంపెనీ చెబుతోంది. ఇక 2025 వ సంవత్సరం నాటికి 1000V 600kw అధిక-వోల్టేజ్ ఛార్జింగ్ సహాయంతో ఎలక్ట్రిక్ వాహనాల బ్యాటరీ కేవలం 5 నిమిషాల్లో 30 శాతం నుంచి 80 శాతం దాకా ఛార్జ్ అవనున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: