Realme C30 : సూపర్ ఫీచర్స్.. త్వరలో లాంచ్!

ఇక ప్రముఖ చైనా స్మార్ట్ ఫోన్ దిగ్గజం రియల్‌మీ నుంచి మరో సరసమైన ఫోన్ ఇండియన్ మార్కెట్లోకి త్వరలో రానుంది.ఇక కొత్త నివేదిక ప్రకారం తెలిసిన విషయం ఏమిటంటే.. ఈ కంపెనీ C-సిరీస్ బడ్జెట్ ఫోన్‌లను లాంచ్ చేయనుంది. Realme C30ని త్వరలో ఇండియన్ మార్కెట్లో ప్రవేశపెట్టనుంది. ఇక ఇప్పటికే ఇండియాలో Realme C31 స్మార్ట్ ఫోన్ ని లాంచ్ చేసింది. దీనికి రానున్న Realme C30 స్మార్ట్ ఫోన్ వచ్చేసి ట్రిమ్-డౌన్ వెర్షన్ కావచ్చు. Realme C30 స్మార్ట్ ఫోన్ కు సంబంధించి ఇప్పటి దాకా కూడా ఎలాంటి లీక్‌లు లేవు. అందుకే ఈ స్మార్ట్ ఫోన్ స్పెసిఫికేషన్‌లను ఊహించడం కూడా కొంచెం కష్టమే. Realme C30 ram స్టోరేజ్ ఏయే కాన్ఫిగరేషన్‌లలో అందుబాటులో ఉంటుందో నివేదిక వెల్లడించడం జరిగింది.Realme C30 డెనిమ్ బ్లాక్, లేక్ బ్లూ ఇంకా బ్యాంబూ గ్రీన్ కలర్లలో రావచ్చు. ఇక ఈ ఫోన్ ఏ డిజైన్ లేదా ప్యాటర్న్‌ని ఫీచర్ చేస్తుందో ఖచ్చితంగా తెలియదు. కానీ, ఇటీవల మార్కెట్లోకి వచ్చిన C-సిరీస్‌ అనేది నో-ఫ్రిల్స్ డిజైన్‌ను కలిగి ఉంటుందని అంచనా. ఈ Realme C30లో 2GB, 3GB ram ఆప్షన్లలో అందుబాటులో ఉంటుందని నివేదిక పేర్కొంది. ఇది మంచి బడ్జెట్ ఫోన్‌గా రానుంది. రెండు ర్యామ్ వేరియంట్‌లకు స్టోరేజ్ 32GB స్టోరేజీతో కూడా రానుందని నివేదిక తెలిపింది.


ఇక Realme C30 గురించి ఎలాంటి సమాచారం అనేది అందుబాటులో లేదు.ఇక Realme మార్చి నెలలో ఇండియన్ మార్కెట్లో Realme C31 ఫోన్ ని లాంచ్ చేసింది. అత్యంత సరసమైన Android ఫోన్‌లలో ఈ ఫోన్ కూడా ఒకటిగా చెప్పవచ్చు. ఇది బడ్జెట్ ఫోన్ అయినా కానీ Realme C31 పెద్ద డిస్‌ప్లేతో పవర్ ఫుల్ ప్రాసెసర్ తో వచ్చింది. అలాగే లైఫ్ లాంగ్ బ్యాటరీని కూడా అందిస్తుంది. Realme C30 స్మార్ట్ ఫోన్ ని వద్దనుకుంటే.. మీరు Realme C31ని కూడా ఎంచుకోవచ్చు. ప్రస్తుతం మార్కెట్లో దీని ధర వచ్చేసి రూ. 8,999గా ఉంది.ఇక Realme C31 HD రిజల్యూషన్‌తో 6.5-అంగుళాల Full Screen డిస్‌ప్లేని అందించారు. ఇది 88.7% స్క్రీన్-టు-బాడీ రేషియోను కలిగి ఉంది. 16.7 మిలియన్ కలర్లకు ఇది సపోర్టు ఇస్తుంది.ఇక ఈ ఫోన్ ఎంట్రీ-లెవల్ కావడంతో డిస్‌ప్లే 60Hz రిఫ్రెష్ రేట్‌కు మాత్రమే సపోర్టు ఇస్తుంది. అంటే స్క్రోలింగ్ యానిమేషన్ అనేది నార్మల్ గా ఉంటుంది. 120Hz టచ్ శాంప్లింగ్ రేట్ స్క్రీన్‌కి మాత్రం గుడ్ టచ్ రెస్పాన్స్ ఉండేలా కూడా చేస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: