బుల్లిపిట్ట: నైక్ బ్రాండ్ నుంచి బ్లూటూత్ షూ.. ఫ్యూచర్స్ అదుర్స్..!!

Divya
ప్రస్తుతం ఇప్పుడు ఎక్కువగా స్మార్ట్ మొబైల్స్, స్మార్ట్ గ్యాడ్జెట్స్ , మరి కొన్ని స్మార్ట్ వాటి లకు ఎక్కువగా బ్లూ టూత్ సదుపాయం తో ఆయా సంస్థలు విడుదల చేస్తూనే ఉన్నాయి . అయితే ఇప్పుడు ప్రముఖ బ్రాండెడ్ కలిగిన నైక్ షూ బ్రాండ్ కు చెందిన వాటిలో ఒక సరికొత్త బ్లూటూత్ షూ ను తయారుచేసి విడుదల చేసింది. ఈ షూ యొక్క ఫ్యూచర్స్, వాటి గురించి పూర్తి వివరాలను తెలుసుకుందాం.
ఈ నైక్ షూ పూర్తిగా ఆటోమేటిక్ షూ కలదు. ఇక ఇది రోబోట్ లాగా షూ లేస్ ని ఆటోమేటిక్ గా కట్టుకుంటోందట. ఈ షూ పెరు" అడాప్ట్ బిబి" అనే పేరు పెట్టింది ఈ సంస్థ. ఇక షూ జోడి చూస్తే బాస్కెట్బాల్ షూలా కనిపిస్తుంది. ఈ షూ వేసుకున్న వెంటనే.. ఆటోమేటిక్ గా లేస్ కట్టుకుంటుంది. ఇక ఇందులో మరోక బెన్ఫిట్ ఏమిటంటే..nike adapt BB బ్లడ్ ప్రెజర్ ను కూడా ఈ షూ తెలియజేస్తుంది. వీటిని ఉపయోగించేటప్పుడు మన కాళ్లకు వాపులు ఉన్నట్లు అయితే.. వాటికి అనుగుణంగానే రక్త ప్రసరణ చేసే విధంగా ఉంటుందట. దీంతో పాదాలు బిగువగా ఉండకుండా వదులుగా ఉంటాయి.

ఈ షూ లను యాప్ ద్వారా కూడా వీటిని కంట్రోల్ చేసుకోవచ్చు. ఇది వరకే ఈ బ్రాండెడ్ నుంచి.. నైక్ బ్రాండ్ నైక్ , ఐఫోన్ నైక్ , ట్రైనింగ్ షూ వంటి వాటిని కూడా ఈ సంస్థ తయారు చేసింది. కానీ ఇందులో nike adapt BB గురించి మాత్రం ఎటువంటి సమాచారం లేదు. కానీ ఇందులో ఎటువంటి షూ ధరించినా కూడా మన పాదాలకు సర్దుబాటు అయ్యేవిధంగా ఉంటాయట. ఇవి మన పాదాలకు ఎటువంటి నొప్పి లేకుండా చాలా కంఫర్టబుల్ గా ఉండే విధంగా వీటిని తయారు చేయడం జరిగింది. రాబోయే షూ ధరలు ఈ వివరాలను త్వరలోనే వెల్లడిస్తామని తెలియజేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: