బుల్లి పిట్ట: ఈ 5 ఎలక్ట్రిక్ బైకులకు మార్కెట్లో మంచి డిమాండ్..!!

Divya
పెరుగుతున్న ఇంధన ధరల కారణంగా సామాన్యులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. అయితే అటువంటి వారికి ఎలక్ట్రిక్ స్కూటర్లు మంచి ప్రోత్సాహాన్ని ఇస్తున్నాయి. వినియోగదారులు అతి తక్కువ డబ్బుతో మెరుగైన ఫీచర్లతో ఈ బైక్లు విడుదల అవుతున్నాయి. ముఖ్యంగా వీటి వల్ల వాయు కాలుష్యం అనేది లేకుండా ఉంటుంది. వీటి కోసం ప్రభుత్వాలు కూడా సబ్సిడీని ప్రకటించాయి. అయితే కొన్ని ఎలక్ట్రిక్ స్కూటర్లు టాప్-5 లో ఉండేవి ఇప్పుడు మనం తెలుసుకుందాం.

1).OLA S1 PRO:
బోలా ప్రాజెక్ట్ నుంచి వచ్చిన ఈ బైక్ మార్కెట్ లో విడుదలైంది దీని ధర రూ.1.27 లక్షలు. ఇందులో వచ్చిన మోటార్ 5500 వాట్ల శక్తిని ఉత్పత్తి చేస్తుంది.
2).ATHER 450X:
భారతదేశంలో ఈ ఎలక్ట్రిక్ బైక్ ధర సుమారుగా రూ.1,40,280 రూపాయలు. ఇది 2 వేరియంట్ల లో 3 రంగుల లో కలదు. ఇందులో టాప్ వేరియంట్ బైక్ ధర రూ.1,59,291 కలదు. ఇది గంటకు 80 కిలోమీటర్ల వరకు ప్రయాణిస్తుంది.
3).SIMPLE ONE ELECTRIC:
ఎలక్ట్రిక్ బైక్ ఒక్కసారి ఛార్జ్ చేస్తే ..200  కిలోమీటర్ల వరకు ప్రయాణిస్తుంది. ఈ బైక్ గరిష్టంగా గంటకు 105 కిలోమీటర్ల వరకు ప్రయాణిస్తుంది. ఈ బైక్ 2.95 సెకండ్లలో 0-40 KMPH వేగాన్ని అందుకోగలరు.
4).OKINAWA OKHI 90:
ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ ధర రూ.1.21 లక్షల రూపాయలు. దీని గరిష్ట వేగం గంటకు 90 K.M ఇది ఒక్కసారి ఛార్జ్ చేస్తే రెండు వందల కిలోమీటర్ల వరకు ప్రయాణిస్తుంది. ఢిల్లీలో దీని ధర రూ.1.3 లక్షలు రూపాయలు.
5).BAJAJ CHETAK EV:
ఈ బైక్ గురించి ఇంటర్నెట్లో అందుబాటు లో ఉన్న సమాచారం ప్రకారం దీని ధర రూ.1,42,297 రూపాయలు కలదు. ఇది కూడా 2 వేరియంట్లలో 6 రంగులలో లభిస్తుంది. ఈ బైకు ముందు భాగంలో కాకుండా వెనుక భాగంలో డ్రమ్ బ్రేకు లు  కలవు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: