బుల్లి పిట్ట: సమ్మర్ లో మీ మొబైల్ వేడెక్కుతోందా అయితే ఈ చిట్కాలు చాలు..!!
1). మొబైల్ కూలర్ సహాయం:
గేమింగ్ ఎక్కువగా ఆడే యూజర్ల కోసం మొబైల్ వేడి కాకుండా ఫోన్ కూలర్లను వంటి పరికరాలను రూపొందించబడ్డాయి దీని సహాయంతో వినియోగదారులు తమ మొబైల్ ను వేడెక్కకుండా చూసుకోవచ్చు.
2). ఎక్కువ యాప్లు ఉండకూడదు:
మనం ఉపయోగించే స్మార్ట్ మొబైల్ లో బ్యాక్గ్రౌండ్ అవసరం లేకపోయినా కొన్ని ఆప్షన్స్ ఉంటాయి. వాటిని తీసి వేయడం మంచిది. లేదంటే అవి అలాగే రన్ అవుతూ ఉండడం వల్ల మీ స్మార్ట్ ఫోన్ బ్యాటరీ వేడెక్కుతుంది.
3). ఎయిర్ ప్లెన్ మోడ్ ని ఆన్ చేయండి:
మొబైల్ వేడి నీ తగ్గించడానికి మీరు ఎయిర్ ప్లెన్ మోడ్ ను ఆన్ చేసుకోవచ్చు ఇది మీ మొబైల్ బ్యాటరీ ఆదా చేయడమే కాకుండా అధిక వేడి సమస్య నుండి చక్కటి పరిష్కారాన్ని ఇస్తుంది.
4). మొబైల్ బ్యాక్ కవర్ మార్చుట:
మనం ఉపయోగిస్తున్న స్మార్ట్ఫోన్ లో నిరంతరం వేడెక్కడం వల్ల అనేక సమస్యలు ఎదురవుతూ ఉంటాయి.. అందుచేతనే మొబైల్ కవర్ ను తీసివేయడం మంచిది. కొన్నిసార్లు మొబైల్ కొన్న బ్యాక్ కవర్ వల్ల కూడా వేడెక్కడం జరుగుతూ ఉంటుంది.
5). మొబైల్ డేటా ఆఫ్ చేయడం:
మొబైల్ హీట్ అయ్యే సమస్య అధికంగా ఉంటే మొబైల్ డేటా ను వెంటనే ఆఫ్ చేయాలి. అధికంగా ఇంటర్నెట్ ఉపయోగించడం వల్ల మీ బ్యాటరీ ఓవర్ హీట్ అవుతుంది.