ఇండియాలో ఫిస్కర్ ఎలక్ట్రిక్ కార్ల విడుదల ఖరారు!

అమెరికాలోని కాలిఫోర్నియాకు చెందిన ఫేమస్ ఎలక్ట్రిక్ కార్ కంపెనీ ఫిస్కర్ (Fisker Inc) ఇప్పుడు ఇండియాలో తమ ప్రధాన కార్యాలయాన్ని తెరవడానికి సిద్ధంగా ఉంది. అమెరికాకు చెందిన ఎలక్ట్రిక్ వాహనాల తయారీ కంపెనీ తన భారత ప్రధాన కార్యాలయానికి హైదరాబాద్‌ను వేదికగా ఎంచుకుంది. ఫిస్కర్ ఇన్‌కార్పోరేషన్ భారతీయ విభాగానికి ఫిస్కర్ విజ్ఞాన్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ (Fisker Vigyan india Pvt Ltd) అని పేరు పెట్టడం జరిగింది.ఇక ఈ మేరకు కంపెనీ టీం గత నెలలో తెలంగాణ రాష్ట్ర ఐటి మంత్రి కేటిఆర్‌తో సంప్రదింపులు కూడా జరిపారు.ఫిస్కర్ హైదరాబాద్ ప్రధాన కార్యాలయంలో ఉద్యోగులు కాలిఫోర్నియాలోని ఇంజనీరింగ్ ఇంకా అలాగే ఉత్పత్తి అభివృద్ధి బృందాల (ప్రోడక్ట్ డెవలప్‌మెంట్ టీమ్)తో కలిసి పని చేస్తారు. ప్రారంభ దశలో భాగంగా, ఈ కంపెనీలో మొత్తం 300 మంది ఐటీ నిపుణులకు ఉపాధి అనేది లభించనుంది.ఇక ఫిస్కర్ తమ ఎలక్ట్రిక్ కార్లను భారత మార్కెట్లో విడుదల చేసేందుకు గ్రౌండ్ వర్క్ ని కూడా చేస్తోంది.


భారతదేశంలో ఫిస్కర్ ముందుగా తమ ఫిస్కర్ ఓషన్‌ (Fisker Ocean) ఎలక్ట్రిక్ కారును రిలీజ్ చేయనున్నట్లు గతంలో ప్రకటించింది. ఫిష్కర్ ఓషన్ (Fisker Ocean) అనేది ఓ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ కార్. ఇది ఈ విభాగంలో టెస్లా కార్లకు గట్టి పోటీగా నిలుస్తుంది. ఈ ఏడాది చివరి నాటికి ఈ మోడల్ అమ్మకాలు ఇంకా అలాగే డెలివరీలు ప్రారంభమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.ఇక ఫిస్కర్ ఓషన్ మూడు ట్రిమ్ లలో అందుబాటులోకి రానుంది. ఇందులో ఫస్ట్ ది ఓషన్ స్పోర్ట్. మార్కెట్లో దీని ధరలు 37,499 డాలర్ల (సుమారు రూ.28.59 లక్షల) నుండి స్టార్ట్ కానున్నాయి. ఇది బేస్ వేరియంట్. ఇంకా పూర్తి చార్జ్ పై గరిష్టంగా 440 కిలోమీటర్ల రేంజ్ ను ఇది ఆఫర్ చేస్తుంది. ఫిస్కర్ ఓషన్ స్పోర్ట్ 275 హెచ్‌పి (205kW) పవర్ ని ఉత్పత్తి చేసే సింగిల్ మోటార్ (ఫ్రంట్ వీల్ డ్రైవ్) డ్రైవ్‌ట్రైన్ ఉంటుంది. ఇంకా అలాగే ఇది కేవలం 6.9 సెకండ్లలోనే గంటకు 0 నుండి 100 వేగాన్ని కూడా చేరుకుంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: