ఏసీని గోడపై ఎత్తుగా ఎందుకు ఫిక్స్ చేస్తారో తెలుసా?

ఇంటిలో ఎయిర్ కండిషనింగ్ (ఏసీ)ను గోడకే అమరుస్తారని అందరికి తెలిసిన విషయమే.ముఖ్యంగా ఎండాకాలంలో ఏసీ లు చాలా ఎక్కువగా వాడుతూ వుంటారు.ఇక ప్రతిచోటా కూడా ఏసీకి సంబంధించి ఇండోర్ ఇంకా అలాగే అవుట్ డోర్ అనే యూనిట్స్ అనేవి ఉంటాయి.ఇండోర్ లో స్ల్పిట్టర్ ఉండగా..ఇక ఇంటికి బయట ఎయిర్ డిశ్చార్జ్ వెంట్ ను ఏర్పాటు చేస్తారు. అయితే ఏసీ ఇండోర్ యూనిట్ ను ఇంట్లోని గోడకు అమర్చడానికి గల కారణాలేంటో మీకు అసలు తెలుసా? అయితే ఇక దాన్ని తెలుసుకోవాలంటే ఈ స్టోరీని చదివేయండి.ఇక గోడకు పైభాగంలో ఏసీని అమర్చడానికి గల కారణం ఏంటంటే..వేసవి కాలంలో ఎండ నుంచి ఉపశమనం పొందేందుకు ఇళ్లలో ఎయిర్ కండిషనర్ల (AC)ను ఎక్కువగా వాడుతుంటారు. ఇక ఏసీని వినియోగించేవారి ఇంట్లో ఇండోర్ యూనిట్ అంటే చల్లని గాలిని స్ల్పిట్ చేసే పరికరం గోడకు పై భాగంలో ఎందుకు అమర్చుతారనే దాని వెనుక చాలా పెద్ద కథ ఉంది. ఇక అందుకు ఓ శాస్త్రీయ కారణం కూడా ఉందట.


వేడి గాలిలో ఎక్కువగా తేమ అనేది ఉంటుంది. కాబట్టి, వేడి గాలి అనేది తేలియాడే స్వభావాన్ని ఎక్కువగా కలిగి ఉంటుంది. అంటే ఇంట్లో వేడి గాలి పై కప్పుకు చాలా దగ్గరగా చేరుతుంది. దీంతో ఎయర్ కండిషనర్ ఆన్ చేసినప్పుడు పైనుంచి కింద దాకా కూడా చల్లని గాలి అనేది వస్తుంది. ఎక్కువ సాంద్రత కలిగిన చల్లని గాలి వెంటనే కిందికి చేరిపోతుంది.ఇక దీంతో పైన ఉన్న వేడి గాలి.. అవుట్ డోర్ యూనిట్ ద్వారా వెంటనే డిశ్చార్జ్ అవుతుంది. దీంతో గది వెంటనే చల్లగా మారిన మంచి అనుభూతి మీకు కలుగుతుంది.ఇక అదే విధంగా చలి కాలంలో హీటర్లను అయితే తక్కువ ఎత్తులో ఉంచుతారు. ఎందుకంటే చాలా ఎక్కువ సాంద్రత కలిగిన చల్లని గాలి నేలకు కొద్దిగా ఎత్తులో ఉంటుంది. దీని వల్ల కింది నుంచి గాలి బాగా వెచ్చగా ఉంచేందుకు హీటర్లను తక్కువ ఎత్తులో ఉంచుతారట.

మరింత సమాచారం తెలుసుకోండి:

AC

సంబంధిత వార్తలు: