ఎలక్ట్రిక్ వెహికల్స్ కి చార్జింగ్ పూర్తిగా ఫ్రీ..!

ఇక పెట్రోల్ ధరలు మండిపోతున్నాయని ఎలక్ట్రి వాహనాలను కొందామనుకుంటే, ఇప్పుడు పెరుగుతున్న విద్యుత్ చార్జీలు కూడా అందుకు సహకరించడం లేదు. మరి ఇలాంటి పరిస్థితుల్లో ఎలక్ట్రిక్ వాహనాలకు పూర్తి ఉచితంగా చార్జింగ్ సదుపాయం లభిస్తే అసలు ఎలా ఉంటుంది? అలాంటి కార్యక్రమాన్ని స్టార్ట్ చేసింది ఎలక్ట్రివా (ElectriVa). దేశ రాజధాని ఢిల్లీలో ప్రజలను ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం వైపుకు గాను ప్రోత్సహించేందుకు ఈ కంపెనీ ఈవీ చార్జింగ్ స్టార్టప్ ఎలక్ట్రివా ఇప్పుడు ఉచిత ఎలక్ట్రిక్ వాహన ఛార్జింగ్ సదుపాయాన్ని అందుబాటులోకి తెచ్చింది.ఢిల్లీ-ఎన్‌సిఆర్ ప్రాంతంలో 40కి పైగా ఛార్జింగ్ స్టేషన్‌లలో ఫ్రీగా ఈవీ ఛార్జింగ్ సౌకర్యాలను పొందవచ్చని ఎలక్ట్రివా తెలిపింది. అయితే, ఈ ఫ్రీ చార్జింగ్ సదుపాయం పొందడానికి ఓ చిన్న షరతు కూడా ఉంది. ఎలక్ట్రివా ఈవీ చార్జింగ్ పాయింట్ల వద్ద రోజు మొత్తం చార్జింగ్ సదుపాయం ఫ్రీగా ఉండదు. ఈ చార్జింగ్ పాయింట్ల వద్ద కేవలం మధ్యాహ్నం 12 నుండి 3 గంటల మధ్య మాత్రమే ఎలక్ట్రివా ఫ్రీగా చార్జింగ్ సదుపాయాన్ని అందిస్తోంది.


మిగిలిన సమయాల్లో ఈవీలను చార్జ్ చేసుకునే కస్టమర్లు మాత్రం తప్పనిసరిగా డబ్బుని చెల్లించాల్సి ఉంటుందట.ఇక ఎలక్ట్రివా ప్రకారం తెలిసిన విషయం ఏమిటంటే..తమ చార్జింగ్ స్టేషన్లలో మధ్యాహ్నం 12 నుండి 3 గంటల దాకా మాత్రమే ఫ్రీ చార్జింగ్ సౌకర్యం లభిస్తుంది. నిజానికి ఈ సమయం వర్కింగ్ ప్రొఫెషనల్స్ కి అంత అనువైన సమయం కానప్పటికీ, చాలా మంది ఎలక్ట్రిక్ వాహనాల వినియోగదారులకు కూడా ఇది ఎంతగానో ఉపయోగడపడుతుందనే చెప్పాలి. ఇక ప్రత్యేకించి వాణిజ్య వినియోగం కోసం ఎలక్ట్రిక్ వాహనాలను ఉపయోగించే వారికి అయితే చాలా పాకెట్ ఫ్రెండ్లీగా ఉంటుంది. ఎలక్ట్రివా తీసుకున్న ఈ చొరవ ద్వారా దేశంలో కాస్తంతైనా ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం పెరిగే ఛాన్స్ అనేది ఉంది. ఇక అదే సమయంలో ఈ కంపెనీకి ఫ్రీ మార్కెటింగ్ సొల్యూషన్ కూడా లభించనుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: