బుల్లి పిట్ట: వన్ ప్లస్ నుంచి సరికొత్త మొబైల్ విడుదల.. ఫీచర్స్ ఇవే..?

Divya
ప్రముఖ స్మార్ట్ మొబైల్ దిగ్గజ  సంస్థలలో  వన్ ప్లస్ కూడా ఒకటి.. అయితే తాజాగా మార్కెట్లో తన హవాని కొనసాగించిన అందుకు సరికొత్త మోడల్స్ ను కూడా విడుదల చేస్తూ ఉంది. ఇప్పుడు వన్ ప్లస్ -10 ప్రో పేరుతో సరికొత్త మొబైల్ లో విడుదల చేసింది. ప్రీమియం రేంజ్ లో విడుదలైన ఈ స్మార్ట్ మొబైల్ హై ఎండ్ ఫీచర్లను అందిస్తుందట. ఇక ఈ స్మార్ట్ మొబైల్ యొక్క ఫ్యూచర్ గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.

ఈ స్మార్ట్ మొబైల్ 6.7 ఇంచులు కలదు. ఇక అంతే కాకుండా హెచ్డీ డిస్ప్లేతో పాటుగా.. అయో ఎల్ఈడి డిస్ప్లే కలదు. కార్నింగ్ గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్ ను కూడా ఈ బ్రాండ్ అందిస్తోంది. ఆండ్రాయిడ్ 12 ఆపరేటింగ్ సిస్టం తో ఈ మొబైల్ పనిచేస్తుంది. ఈ స్మార్ట్ మొబైల్ స్నాప్ డ్రాగన్ 8  జనరేషన్ వన్ 5-G ప్రాసెస్ లో కలదు. ఇక ఇందులో బ్యాటరీ విషయానికి వస్తే..80W సూపర్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుందట.5000 MAH బ్యాటరీ తో కూడా లభిస్తుంది. దీంతో ఈ ఫోన్ కేవలం 15  నిమిషాల్లోనే 70 % చార్జ్ అవుతుందని వన్ ప్లస్ సంస్థ తెలియజేస్తోంది.

ఇక కెమెరా విషయానికి వస్తే..48 మెగాఫిక్సల్ తో బ్యాక్ కెమెరా. ఫ్రంట్ కెమెరా 32 మెగాఫిక్సల్ తో కలదు. ఇక వీడియో రికార్డింగ్ కోసం ఇందులో మూవీ3 అనే ఫీచర్ ను కూడా అందిస్తోందట. ఇక ఈ ఫైవ్ జి స్మార్ట్ ఫోన్ ను రెండు వేరియంట్లలో విడుదల చేస్తోంది.. ధర విషయానికి వస్తే..8GB,+128 GB స్టోరేజ్ గల మొబైల్ ధర.. రూ.66,999 రూపాయలు కాగా..12GB+256 GB స్టోరేజ్ గల మొబైల్ ధర.. రూ.71,999 రూపాయలు కలదు. మీ మొబైల్ ఏప్రిల్ 5వ తేదీ నుంచి ఆన్లైన్లో అందుబాటులో కలదు. మరి ఈ సరికొత్త మొబైల్ ఎలా ఆకట్టుకుంటుందో చూడాలి మరి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: