ఈ రోజుల్లో భారతదేశంలో ఎక్కడో మారు మూల గ్రామాల్లో తప్ప మనలో చాలా మంది డిజిటల్ చెల్లింపు మోడ్‌లను ఉపయోగించడం స్టార్ట్ చేశారు. యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్ (UPI) అనేది చాలా విస్తృతంగా ఉపయోగించే పద్ధతి. ఇక ఇది ఒక అప్లికేషన్‌లోని అనేక బ్యాంక్ ఖాతాలతో ఏకీకృతం చేయబడింది. ఇన్‌స్టంట్ మనీ ట్రాన్స్‌ఫర్ చేసే సౌలభ్యం ఆన్‌లైన్ చెల్లింపుల ప్రపంచాన్ని పూర్తిగా మార్చేసింది. చాలా ఈజీగా అత్యంత వేగంగా చెల్లింపులు జరుగుతున్నాయి. ఇక UPI ద్వారా చెల్లింపులను ప్రాసెస్ చేయడానికి, google pay మీ బ్యాంక్ ఖాతాకు కనెక్ట్ అవుతుంది. ఈ విధంగా, మీరు విభిన్న UPI సర్వీస్ ప్రొవైడర్‌లకు భిన్నమైన వర్చువల్ పేమెంట్ అడ్రెస్ ని క్రియేట్ చేయవచ్చు. అయితే చాలా మంది కూడా ఒకటే UPI ID వాడుతుంటారు. కాని మీరు ఒకటి కంటే ఎక్కువ UPI IDలను సృష్టించగలరని మీకు తెలుసా? అయితే google Payలో మరొక UPI IDని ఎలా క్రియేట్ చెయ్యాలో మేము మీకు తెలియజేస్తాము.
మీరు మీ ప్రస్తుత అకౌంట్ ద్వారా చెల్లింపులు చేయడంలో సమస్యలను ఎదుర్కొంటున్నట్లయితే, మీరు google Payలో కొత్త అకౌంట్ ని సెటప్ చేయవచ్చు. మీరు మీ ప్రస్తుత బ్యాంక్ అకౌంట్ కు కొత్త UPI IDని యాడ్ చేయమని ప్రాంప్ట్ అందుకుంటారు.ఇక google Payలో కొత్త UPI IDని క్రియేట్ చేయడానికి ఈ స్టెప్స్ ని అనుసరించండి. మీ స్మార్ట్‌ఫోన్‌లో google pay యాప్‌ని తెరిచి, దానికి సైన్ ఇన్ చేయండి. స్క్రీన్ పైన కుడి కనిపించే ఫోటోపై క్లిక్ చేయండి. పేమెంట్ ప్రాసెస్ లను ఎంచుకోండి. మీ కొత్త UPI ID కోసం మీరు యాడ్ చెయ్యాలనుకుంటున్న బ్యాంక్ అకౌంట్ ని సెలెక్ట్ చేసుకోండి.డ్రాప్-డౌన్ మెను నుండి 'మేనేజ్ UPI ID'ని సెలెక్ట్ చేసుకోండి. ఇక మీరు క్రియేట్ చెయ్యాలనుకుంటున్న దాని పక్కన ఉన్న '+' చిహ్నంపై నొక్కండి. ఇక్కడ, మీరు చెల్లింపులు చేయడానికి ఉపయోగించాలనుకుంటున్న UPI IDని 'చెల్లించడానికి అకౌంట్ ని సెలెక్ట్ చేసుకోండి' అనే ఆప్షన్ ని ఎంచుకోవచ్చు. తరువాత మీరు ‘యాడ్ నౌ’ ఎంపికను నొక్కినప్పుడు, అదనపు UPI IDని పొందడానికి google pay మీకు SMSను పంపుతుంది. ఈ SMS ఛార్జ్ చేయబడుతుంది.